కరోనా టెర్రర్.. మరో స్టార్ హీరోకు పాజిటివ్

సెకెండ్ వేవ్ లో కరోనా మరింత విజృంభిస్తోంది. ఇంకాస్త ప్రమాదకారిగా మారింది. ఫస్ట్ వేవ్ లో తప్పించుకున్నోళ్లంతా సెకెండ్ వేవ్ లో బాధితులవుతున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే పలువురు తారలు కరోనా బారిన పడగా..…

సెకెండ్ వేవ్ లో కరోనా మరింత విజృంభిస్తోంది. ఇంకాస్త ప్రమాదకారిగా మారింది. ఫస్ట్ వేవ్ లో తప్పించుకున్నోళ్లంతా సెకెండ్ వేవ్ లో బాధితులవుతున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే పలువురు తారలు కరోనా బారిన పడగా.. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ కు కూడా కరోనా సోకింది.

తనకు కరోనా సోకిన విషయాన్ని అక్షయ్ స్వయంగా ప్రకటించాడు. ఈరోజు ఉదయాన్నే తనకు కరోనా వచ్చినట్టు తెలిసిందని, వెంటనే తను హోం ఐసొలేషన్ లోకి వెళ్లిపోయానని అక్షయ్ కుమార్ ప్రకటించుకున్నాడు. ప్రస్తుతం తను వైద్యుల పర్యవేక్షణలో ఉన్నానని, తనతో టచ్ లోకి వచ్చిన వాళ్లంతా విధిగా కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నాడు.

తొలి దశ కరోనా టైమ్ లో పలు ఛారిటీ కార్యక్రమాల్లో పాల్గొన్నాడు అక్షయ్ కుమార్. కరోనా నివారణ చర్యల కోసం భారీగా విరాళం కూడా ప్రకటించాడు. ఇప్పుడు సెకెండ్ వేవ్ లో అదే కరోనా బారిన పడ్డాడు.

అంతేకాదు.. లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత విదేశాల్లో షూటింగ్ చేసిన తొలి హీరోగా కూడా గుర్తింపు తెచ్చుకున్నాడు అక్షయ్ కుమార్. తను నటిస్తున్న బెల్ బాటమ్ సినిమా షెడ్యూల్ ను లండన్ లో స్టార్ట్ చేసి అందరికీ షాకిచ్చాడు.

ఆ టైమ్ లో ఎంతో కేర్ తీసుకొని కరోనా రాకుండా జాగ్రత్తపడిన అక్షయ్.. ఈసారి మాత్రం ఆ మహమ్మారి నుంచి తప్పించుకోలేకపోయాడు.