Advertisement

Advertisement


Home > Movies - Movie News

'అల' 'అల్లు'కి వచ్చిందెంత?

'అల' 'అల్లు'కి వచ్చిందెంత?

అల వైకుంఠపురములో సినిమా హీరో అల్లు అర్జున్ కు ఓ మెమరబుల్ మూవీగా మిగిలిపోయింది. నాన్ బాహుబలి రికార్డు సాధించి, అటు నిర్మాతలకు, ఇటు హీరోకి, దర్శకుడికి కూడా అద్భుత విజయాన్ని అందించింది. అయితే ఈ విజయం సంగతి అలా వుంచితే, ఈ సినిమా వల్ల టోటల్ గా అల్లు ఫ్యామిలీకి ఎంత సంపద సమకూరింది అన్నది పాయింట్.

హీరోగా అల్లు అర్జున్ కు రెమ్యూనిరేషన్ తో పాటు, హీరో కుటుంబ సంస్థ అయిన గీతా ఆర్ట్స్ కు నిర్మాణ భాగస్వామ్యం వుంది. ఆ సంగతి తెలిసిందే. అయితే ఇలా వుండడం వల్ల మొత్తం ఎంత వచ్చి వుంటుంది అన్నది కాస్త ఆసక్తి కరం.

విశ్వసనీయ వర్గాల బోగట్టా ప్రకారం అల్లు అర్జున్ రెమ్యూనిరేషన్ 24 కోట్ల వరకు వుంది. ఇది కాక, గీతా సంస్థకు సినిమాకు వచ్చే లాభాల్లో 40శాతం వాటా. సినిమాకు పెట్టుబడి పెట్టి, నిర్మించిన హారిక హాసినికి 60శాతం వాటా వుంటుందని తెలుస్తోంది. ఈ సినిమాకు నిర్మాణానికి ముందు లాభాలు, తరువాత ఓవర్ ఫ్లోస్ అన్నీ కలిపి కనీసం నలభై కోట్ల వరకు లాభాలు వుంటాయని ఓ అంచనా. అంటే ఆ విధంగా గీతా సంస్థకు కనీసం 16 కోట్ల వరకు వచ్చే అవకాశం వుంది.

ఆ విధంగా అల్లు ఫ్యామిలీకి 24 ప్లస్ 16 కోట్ల వెళ్లినట్లు. ఇది కాక, రెండు ఏరియాలను గీతా సంస్థ రేటు కట్టి డిస్ట్రిబ్యూషన్ కు తీసుకుంది. అక్కడ 20 పర్సంట్ కమిషన్ కూడా వస్తుంది. ఇలా అన్ని విధాలుగా అల్లు ఫ్యామిలీకి అల వైకుంఠపురములో సినిమా నుంచి ఆనందమే ఆనందం.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?