cloudfront

Advertisement


Home > Movies - Movie News

చుట్టూతిరిగి జగన్ గూటికి చేరిన అలీ

చుట్టూతిరిగి జగన్ గూటికి చేరిన అలీ

మొన్నటివరకు టీడీపీలో కొనసాగారు. ఈసారి సైకిల్ గుర్తుపై పోటీ చేయడం గ్యారెంటీ అని అంతా ఫిక్స్ అయిపోయారు. కానీ అలీ మనసు మాత్రం జగన్ వైపే ఉంది. అందుకే ఎన్నికల షెడ్యూల్ వెలువడిన వేళ, ఆఖరి నిమిషంలో అలీ మనసు మార్చుకున్నారు. టీడీపీకి గుడ్ బై చెప్పారు. మరికాసేపట్లో వైఎస్ఆర్సీపీలో చేరబోతున్నారు. అలీకి వైసీపీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించబోతున్నారు జగన్. 

మొన్నటికిమొన్న అలీకి చెందిన ఓ సన్మాన కార్యక్రమానికి కూడా చంద్రబాబు హాజరయ్యారు. దీంతో అలీ టీడీపీలోనే ఉంటారని, గుంటూరు వెస్ట్ లేదా రాజమండ్రి నుంచి టీడీపీ తరఫున పోటీ చేస్తారని అంతా భావించారు. కానీ అలీ లెక్కలు అలీకి ఉన్నాయి. ఈసారి టీడీపీ కంటే వైసీపీకే మెరుగైన పరిస్థితులు ఉన్నాయని భావించిన ఈ సీనియర్ నటుడు, జగన్ పార్టీలోకి చేరడానికి సిద్ధమైపోయారు. 

అంతా బాగానే ఉంది కానీ వైసీపీలో అలీకి టిక్కెట్ దక్కుతుందా అనేది ఇక్కడ ప్రశ్న. తనకు ఎమ్మెల్యే టిక్కెట్ ఇచ్చిన పార్టీలోనే చేరతానంటూ మొన్నటివరకు అలీ మంకుపట్టు పట్టారు. అంతేకాదు, అధికారంలోకి వచ్చిన తర్వాత తనకు మంత్రిపదవి కూడా కావాలన్నారు. ఈ మేరకు తనకు లిఖితపూర్వకంగా రాసిచ్చిన పార్టీలోనే చేరతానంటూ అలీ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

అప్పట్లో ఓ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇలా సంచలన ప్రకటనలు చేసినప్పటికీ, ప్రస్తుతానికి అలీ వాస్తవాల్ని అర్థంచేసుకున్నారు. వైసీపీతోనే ప్రత్యక్ష రాజకీయ జీవితాన్ని ప్రారంభించాలని గట్టిగా ఫిక్స్ అయ్యారు. ప్రస్తుతానికి జగన్ ముందు అలీ ఎలాంటి డిమాండ్స్ పెట్టలేదు. అటు జగన్ కూడా అలీ లాంటి పాపులర్ నటుడ్ని ఖాళీగా ఉంచాలనుకోవడం లేదు. చూద్దాం.. అలీకి ఏ స్థానం నుంచి సీటు దక్కుతుందో?

నన్ను ఏమైనా చేసినా డైరెక్ట్ సినిమా అందులోనే..