cloudfront

Advertisement


Home > Movies - Movie News

మహేష్ నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడతా

మహేష్ నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడతా

మహర్షి సినిమాలో కీలకపాత్ర పోషించే అవకాశం కేవలం వంశీ పైడిపల్లి వల్ల రాలేదంటున్నాడు అల్లరినరేష్. ఆ పాత్రను నేనైతేనే బాగుంటుందని స్వయంగా మహేష్ కూడా ఫీలయ్యాడని, అందుకే మహర్షి సినిమాలో అవకాశం వచ్చిందని, మహేష్ నమ్మకాన్ని నిలబెడతానని అంటున్నాడు.

"నాకు పాప పుట్టిన తర్వాత ఒప్పుకున్న మొదటి సినిమా మహర్షి. నటుడిగా నాకు రీఎంట్రీలా భావిస్తున్నాను. నిజానికి 2016లోనే ఇది స్టార్ట్ అవ్వాల్సింది. మహేష్ వేరే సినిమాల వల్ల లేట్ అవుతూ ఇప్పుడు స్టార్ట్ అయింది. మహర్షి సినిమాలో ఓ పాత్రకు నేను అయితే బాగుంటానని వంశీ పైడిపల్లితో పాటు మహేష్ కూడా భావించారు. వాళ్ల నమ్మకాన్ని నిలబెడతాను."

మహర్షి సినిమాలో మహేష్ కు బెస్ట్ ఫ్రెండ్ గా నటిస్తున్న అల్లరి నరేష్.. సినిమాలో తనది గెస్ట్ రోల్ కాదంటున్నాడు. దాదాపు సినిమా మొత్తం కనిపిస్తానని, మహేష్ ఎక్కడుంటే అక్కడుంటానంటున్నాడు. "దాదాపు సినిమా మొత్తం కనిపిస్తాను. ఇప్పటికే 45 రోజులు షెడ్యూల్ అయింది. అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు ఆ సినిమా సెట్స్ పైనే ఉంటాను. మరో వంద రోజులు మహర్షి సెట్స్ పైనే ఉండబోతున్నాను."

మహర్షి సినిమాలో తనపాత్ర చాలా ప్రత్యేకంగా ఉంటుందని, అంతకుమించి తన రోల్ గురించి ఇప్పుడే చెప్పలేనంటున్నాడు అల్లరోడు. గమ్యంలో గాలిశీను, శంభోశివశంభో సినిమాలో మల్లిగాడు పాత్రలు ఎలా గుర్తుండిపోయాయో.. మహర్షిలో తన క్యారెక్టర్ అలా నిలిచిపోతుందని చెబుతున్నాడు. ఇక మహేష్ తో వర్క్ చేయడం మరపురాని అనుభూతి అంటున్నాడు.

"మహేష్ తో వర్క్ చేయడం చాలా బాగుంది. మేమిద్దం ఒకే హైట్. మహేష్ చాలా ఎంజాయ్ చేస్తారు. ఆయనకు మంచి సెన్సాఫ్ హ్యూమర్ ఉంది. సెట్స్ లో ఏమైనా జోకులు పేలితే అందరికంటే ఎక్కువ ఎంజాయ్ చేసేది మహేషే."

ప్రస్తుతానికి మేకర్స్ ఎవరూ మంచి క్యారెక్టర్స్ తో తనను సంప్రదించలేదంటున్న అల్లరి నరేష్.. మహర్షి సినిమా రిలీజ్ అయిన తర్వాత తన కెరీర్ ఊపందుకుంటుందనే ఆశాభావంతో ఉన్నాడు.