అల్లు అరవింద్ బ్లెస్సింగ్స్ ద‌క్కేసాయి

సాయి ధరమ్ తేజ్ తమ్ముడు పంజా వైష్ణవ్ తేజ్ కూడా హీరోగా పరిచయం అవుతున్నాడంటే… మెగా అభిమానులు కెూడా ‘ఇంకెంతమంది వస్తారు’ అన్నట్టుగా రియాక్ట్ అయ్యారు. ఒకే కుటుంబం నుంచి అంత మంది హీరోలుగా…

సాయి ధరమ్ తేజ్ తమ్ముడు పంజా వైష్ణవ్ తేజ్ కూడా హీరోగా పరిచయం అవుతున్నాడంటే… మెగా అభిమానులు కెూడా ‘ఇంకెంతమంది వస్తారు’ అన్నట్టుగా రియాక్ట్ అయ్యారు. ఒకే కుటుంబం నుంచి అంత మంది హీరోలుగా వస్తే ఆ రియాక్షన్స్ సహజమే. అయితే తొలి సినిమా చాలా బాగా సెట్ చేసుకున్నాడు వైష్ణవ్ తేజ్.

ఉప్పెన చిత్రానికి మంచి క్రేజ్ రావడంతో ఓటిటి రిలీజ్ ఊసే లేదని థియేట్రికల్ రిలీజ్ కోసం మైత్రి మూవీ మేకర్స్ ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాతో వైష్ణవ్ తేజ్ హీరోగా నిలబడిపోతాడనే టాక్ ఇండస్ట్రీలో ఉంది. అందుకు తగ్గట్టే అతడి మలి చిత్రం అల్లు అరవింద్ సంస్థలో ఖరారయింది. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన వారిలో పలువురి రెండవ చిత్రాలను అల్లు అరవింద్ నిర్మించారు.

ఆ ఆనవాయితీని కొనసాగిస్తూ వైష్ణవ్ తేజ్ కోసం కూడా ఒక ఆసక్తికరమయిన ప్రాజెక్ట్ సిద్ధం చేస్తున్నారట. ఉప్పెన కనుక అంచనాలకు తగ్గట్టే ఆకట్టుకుంటే ఈ చిత్రానికి క్రేజ్ పరంగా ఢోకా వుండదు. ప్రస్తుతం కథాచర్చల్లో వున్న ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లేది మాత్రం వచ్చే ఏడాదిలోనేనట.

రైతులు త్యాగం చేశారా.. డీల్ చేసుకున్నారా ?