cloudfront

Advertisement


Home > Movies - Movie News

అల్లు అరవింద్‌ స్ట్రాటజీ మారింది

అల్లు అరవింద్‌ స్ట్రాటజీ మారింది

ఇంతకుముందు భారీ చిత్రాల మీదే దృష్టి పెట్టిన సీనియర్‌ నిర్మాత అల్లు అరవింద్‌ 'గీత గోవిందం' తర్వాత చిన్న సినిమాలపై దృష్టి పెడుతున్నారు. కేవలం తాము నిర్మించే చిత్రాలనే కాకుండా వేరే నిర్మాతలు తీసిన సినిమాలకి మంచి బజ్‌ వుంటే కనుక రైట్స్‌ తీసేసుకుంటున్నారు. ఇంతకుముందు సురేష్‌బాబు మాత్రమే ఇలాంటి నిర్మాతలకి ఆప్షన్‌గా వుండేవారు.

కానీ 'పేపర్‌బాయ్‌' చిత్రం హక్కులు తీసుకోవడం ద్వారా అరవింద్‌ కూడా ఇకపై చిన్న చిత్రాలకి గేట్‌వేగా మారనున్నారు. అలాగే 'గీత గోవిందం'తో ఒక మాదిరి బడ్జెట్‌ వున్న సినిమా ఎంత రేంజ్‌కి చేరుకుంటుందో స్వయంగా చూడడంతో ఇక మీదట ఈ తరహా చిత్రాలు సంవత్సరానికి మూడు అయినా నిర్మించాలని నిర్ణయించుకున్నారట.

భారీ సినిమాలు రెండేళ్లకి ఒకటి తీసే బదులు ఇలాంటి రిస్క్‌ ఫ్రీ చిత్రాలపై ఇన్వెస్ట్‌ చేయడం ఉత్తమమని, ఇందుకోసం పలువురు యువ హీరోలకి అడ్వాన్సులు కూడా చెల్లించడమే కాకుండా కొత్త దర్శకులకి కూడా అవకాశం ఇవ్వడానికి బన్నీ వాస్‌ ఆధ్వర్యంలో ఒక సెపరేట్‌ టీమ్‌ సిద్ధం చేస్తున్నారని సమాచారం.

దిల్‌ రాజు తప్ప అగ్ర నిర్మాతలు ఎవరూ ఇలా ఎక్కువ సినిమాలు తీయకపోవడం వల్ల ఇన్నాళ్లూ తక్కువ ఆప్షన్లు వున్నాయి. అల్లు అరవింద్‌ రంగంలోకి దిగడం యువ దర్శకులకి శుభ సూచకమే.