cloudfront

Advertisement


Home > Movies - Movie News

అమర్ కామెడీ.. అక్బర్ కామెడీ.. ఆంటోనీ కామెడీ

అమర్ కామెడీ.. అక్బర్ కామెడీ.. ఆంటోనీ కామెడీ

అమర్ అక్బర్ ఆంటోనీ సినిమా టీజర్ ఎంత సీరియస్ గా ఉందో చూశాం. అంతకు ముందు రవితేజ గెటప్స్, ఫస్ట్ లుక్స్ కూడా సీరియస్ గానే ఉన్నాయి. కానీ సినిమా మాత్రం ఫుల్ కామెడీ అంటోంది యూనిట్. అంతేకాదు, ప్రచారంలో భాగంగా చేసిన తొలి ఇంటర్వ్యూకే చుట్టూ కమెడియన్లను పెట్టి హంగామా చేసింది.

అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాకు సంబంధించి టోటల్ కమెడియన్స్ తో ఇంటర్వ్యూ చేసింది యూనిట్. శ్రీనివాసరెడ్డి ప్రశ్నలు అడుగుతుంటాడు. సత్య, వెన్నెల కిషోర్, గిరి, రవితేజ, శ్రీనువైట్ల సమాధానాలు చెబుతుంటారు. కేవలం సినిమాలో ఉన్న కామెడీ గురించి మాట్లాడుకుంటూ (మనకు అర్థం కాకపోయినా) తెగ నవ్వుకున్నారు వీళ్లంతా.

ఈ సినిమాలో అమర్, అక్బర్, ఆంటోనీ పాత్రలు మూడూ కామెడీ చేస్తాయంటున్నాడు రవితేజ. సందర్భానికి తగ్గట్టు ప్రతి క్యారెక్టర్ కామెడీ పండిస్తుందని, ఒక్కో క్యారెక్టర్ కు ఒక్కో కమెడియన్ ఎటాచ్ అయి ఉంటాడని చెబుతున్నాడు. ఇంకా చెప్పాలంటే, శ్రీనువైట్ల మార్క్ లోనే పక్కా కామెడీ ఎంటర్ టైనర్ గా సినిమా ఉంటుందని శెలవిస్తున్నాడు.

తన కెరీర్ లో దూకుడు సినిమా కాస్త ఎమోషనల్ గా ఉంటుందని, అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాలో ఆమాత్రం ఎమోషనల్ టచ్ కూడా ఉండదంటున్నాడు దర్శకుడు శ్రీనువైట్ల. మరి సినిమాలో అంత కామెడీ ఉన్నప్పుడు, టీజర్ ను అంత సీరియస్ గా చూపించడం ఎందుకు? ఆ గన్స్, గెటప్స్ ఎందుకు? రవితేజ మంచి కామెడీ పండిస్తాడు కదా, అతడి సంబంధించిన కామిక్ లుక్ తో టీజర్ రిలీజ్ చేస్తే బాగుండేదేమో.

మరోవైపు సినిమాలో అమర్, అక్బర్, ఆంటోనీ అనే పాత్రలు వేటికవే భిన్నమైనవా.. లేక అన్నదమ్ములా.. లేక ఒక వ్యక్తే ఇలా 3 గెటప్స్ లో కనిపిస్తాడా అనే అంశంపై మాత్రం రవితేజ క్లారిటీ ఇవ్వలేదు. సినిమా చూసి తెలుసుకోవాలంటున్నాడు. మొత్తమ్మీద తొలి ప్రచార కార్యక్రమంలో రవితేజను మధ్యలో కూర్చోపెట్టి, కమెడియన్లంతా చక్కగా మాట్లాడుకున్నారు. రవితేజకు అప్పుడప్పుడు మాట్లాడే అవకాశం ఇచ్చారు.

జగన్ ను పరామర్శించాడు.. జంప్ కూడా చేస్తాడా? చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్