cloudfront

Advertisement


Home > Movies - Movie News

అమైరా దస్తుర్‌ని వేధించిన ఆ హీరో ఎవరు?

అమైరా దస్తుర్‌ని వేధించిన ఆ హీరో ఎవరు?

తెలుగులో అమైరా దస్తుర్‌ రెండు సినిమాల్లో నటించింది. వాటిల్లో ఒకటి, 'రాజుగాడు' కాగా, మరొకటి 'మనసుకు నచ్చింది'. 'రాజుగాడు' సినిమాలో రాజ్‌ తరుణ్‌ హీరో. 'మనసుకు నచ్చింది' సినిమాలో అమైరా సరసన నటించిన హీరో సందీప్‌ కిషన్‌. ఆమె సౌత్‌లో మరో సినిమాలోనూ నటించింది. అదే 'అనేగన్‌'. ధనుష్‌ హీరోగా నటించిన సినిమా అది. బాలీవుడ్‌లోనూ అమైరా కొన్ని సినిమాల్లో నటించింది.

మొత్తం భారతీయ సినిమా రంగాన్ని ఇప్పుడు 'మీ.. టూ..' ప్రకంపనలు కుదిపేస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో అమైరా దస్తుర్‌ సైతం 'ఆరోపణల బాంబ్‌' పేల్చింది. ఓ హీరో, షూటింగ్‌ సమయంలో తన చెవిలో గుసగుసలాడేవాడనీ, అది నచ్చక అతన్ని తాను దూరంపెడితే.. అప్పటినుంచీ తనను మరింత దారుణంగా వేధింపులకు గురిచేశాడనీ, షూట్‌ సమయానికంటే ముందే రప్పించి, పడిగాపులు పడేలా చేసేవాడనీ, అలా తాను ఆ షూటింగ్‌ సమయంలో రోజుకి నాలుగైదు గంటలు నిద్రపోవడం కూడా కష్టమయ్యేదని చెప్పింది అమైరా దస్తుర్‌. ఇంతకీ ఎవరా హీరో.? అన్నది మాత్రం చెప్పలేదు.

ఓ దర్శకుడు సైతం, అమైరాతో అసభ్యకరంగా ప్రవర్తించాడట. అమైరా, అతన్ని వారించేసరికి.. షూటింగ్‌ పేరు చెప్పి, అనవసరంగా ఆమెతో వెయిట్‌ చేయించేవాడట. ప్రస్తుతానికి ఆ వ్యక్తుల పేర్లు తాను బయటపెట్టదలచుకోలేదనీ, వారు తమ పద్ధతిని ఇకనైనా మార్చుకుంటారని ఆశిస్తున్నాననీ, తాను ఎవరి గురించి చెబుతున్నానో.. వారికి తనమాటలు సూటిగా తగులుతాయనీ అమైరా దస్తుర్‌ అంటోంది.

'కాస్టింగ్‌ కౌచ్‌' విషయంలో మాత్రం అమైరా దస్తుర్‌, తనకు అలాంటి పరిస్థితులు ఎదురుకాలేదని చెప్పడం గమనార్హం. 16 ఏళ్ళ వయసులో మోడలింగ్‌ ద్వారా గ్లామరస్‌ ప్రపంచంలోకి వచ్చిన అమైరా దస్తుర్‌, ప్రస్తుతం బాలీవుడ్‌లో కొన్ని సినిమాలు చేస్తోంది.