cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Movie News

రిలేష‌న్‌షిప్ వార్త‌ల‌పై ఎంజాయ్ చేస్తున్న న‌టి

రిలేష‌న్‌షిప్ వార్త‌ల‌పై ఎంజాయ్ చేస్తున్న న‌టి

గ్లామ‌ర్ రంగంలో రిలేష‌న్‌షిప్‌ల‌పై రూమ‌ర్స్ రావ‌డం స‌హ‌జ‌మే. కొంత మంది న‌టీన‌టులు అలాంటి రూమ‌ర్స్‌ను మొగ్గ ద‌శ‌లోనే క‌ట్ చేస్తుంటారు. మ‌రికొంద‌రు మాత్రం ప‌ట్టించుకోకుండా త‌మ ప‌ని తాము చేసుకుపోతుంటారు. అయితే ఒక టీవీ న‌టి మాత్రం త‌న‌పై వ‌స్తున్న రూమ‌ర్స్ గురించి వింటూ తెగ ఎంజాయ్ చేస్తున్న‌ట్టు చెప్పుకొస్తోంది. అంతే కాదండోయ్‌, ఆ న‌టిలో ప్రేమ క‌విత్వం పొంగుకొచ్చింది. దీంతో ఏకంగా ఓ చ‌క్క‌టి ప్రేమ లేఖ రాసేసింది. ఆసక్తిదాయ‌క‌మైన ఆ సంగ‌తుల గురించి తెలుసుకుందాం.

బిగ్‌బాస్ రియాల్టీ షోకు అన్ని భాష‌ల్లోనూ విశేష‌మైన ఆద‌ర‌ణ ఉన్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే తెలుగులో బిగ్‌బాస్ సీజ‌న్ -4 స్టార్ట్ అయి టీఆర్‌పీ రేటింగ్‌లో దూసుకుపోతోంది. ఇక హిందీలో కూడా వ‌చ్చే నెల 3న బిగ్‌బాస్ రియాల్టీ షో ప్రారంభం కానుంది. దీంతో ఈ షోలో పాల్గొనే కంటెస్టెంట్లకు సంబంధించి ప‌లువురి పేర్లు తెర‌పైకి వ‌చ్చాయి. 

అలాంటి వారిలో టీవీ న‌టి టీనా ద‌త్తా పేరు ప్ర‌ముఖంగా విన‌వ‌స్తోంది.  సోష‌ల్ మీడియాలో ఈమె గురించి పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రుగుతోంది. టీనా మొద‌ట  స‌బ్బుకి సంబంధించిన ఓ  అడ్వ‌టైజ్‌మెంట్‌తో గుర్తింపు పొందింది. ఆ త‌ర్వాత టెలివిజ‌న్ రంగంలో అవ‌కాశాలు వెతుక్కుంటూ వ‌చ్చాయి. ప్ర‌స్తుతం టీవీ న‌టిగా అంద‌రికీ సుప‌రిచితురాలైంది.

ఈ నేప‌థ్యంలో టీనా ద‌త్తా సోష‌ల్ మీడియా వేదిక‌గా స్పందించారు. త‌న‌పై జ‌రుగుతున్న ప్ర‌చారంలో వాస్త‌వం లేద‌ని చెప్పు కొచ్చారు. అంత‌టితో ఆగ‌కుండా అలాంటి రూమ‌ర్ల‌కు చెక్ పెట్టేందుకు ఏకంగా ఆమె బిగ్‌బాస్‌కే అద్భుత‌మైన ప్రేమ లేఖ రాయ‌డం విశేషం. సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న స‌ద‌రు ప్రేమ లేఖ గురించి త‌ప్ప‌క తెలుసుకోవాల్సిందే. అది ఎలా సాగిందంటే...

''ప్రియ‌మైన బిగ్‌బాస్.. ఎలా ఉన్నారు. బ‌య‌టి స‌మాజంలో మీరెంత పాపుల‌రో మీకు తెలుసా? అంతేకాదు, మిమ్మ‌ల్ని ఎంత‌గా ప్రేమిస్తున్నారో తెలుసా?  ఆ విష‌యాలు తెలియ‌జేయ‌డానికే ఈ లేఖ . నేను చెబుతా వినండి..మీతో నాకున్న రిలేష‌న్ గురించి పుకార్లు మొద‌లైన‌ప్ప‌టి నుంచి నా ఫోన్ నాన్‌స్టాప్‌గా మోగుతూనే ఉంది. మీడియా వాళ్లు, స్పాన్స‌ర్స్‌, మిత్రులు.. ఒక‌రా ఇద్ద‌రా! లెక్క లేనంత మందికి ఒక్క‌సారిగా నేను గుర్తుకొచ్చాను. అప్పుడు అర్థ‌మైంది... బిగ్‌బాస్ ప‌వ‌ర్ ఏంటో. అబ్బో ఇలా అంద‌రి కాల్స్‌, మెసేజ్‌ల‌తో  నా ఫోన్ మోగిపోతోంది.

ఈ హ‌డావుడి అంతా చూస్తుంటే నాకు ఎంగేజ్‌మెంట్ ఈవెంట్ జ‌రిగిందేమో అనిపిస్తోంది. మ‌న ఇద్ద‌రి గురించి న్యూస్‌లు, వెబ్‌సైట్‌లో వార్త‌లు వ‌స్తుండ‌టం తెగ ఎంజాయ్ చేస్తున్నాను.. మన బంధం స్వ‌ర్గంలోనూ, భూమి మీద‌నో, టెలివిజ‌న్ తెర‌పైనో నిర్ణ‌యించింది  కాదు. అస‌లు ఈ వార్త బ‌య‌ట‌కు ఎలా వ‌చ్చిందో అర్థం కావ‌ట్లేదు.

నేను మిమ్మ‌ల్ని ప్రేమిస్తున్నాను కానీ కంటెస్టెంట్‌లా కాదు..ప్రేక్ష‌కురాలిగానే'' అంటూ బిగ్‌బాస్‌కు ప్రేమ లేఖ రాస్తూనే స్టీట్‌గా త‌న‌పై వ‌స్తోన్న రూమ‌ర్ల‌కు ఫుల్‌స్టాప్ పెట్టింది. బిగ్‌బాస్‌ను ప్రియుడిగా భావించి టీనా ఎంతో భావుక‌త‌తో ప్రేమ‌కు అక్ష‌ర రూపం ఇవ్వ‌డం నెటిజ‌న్ల‌ను క‌ట్టి ప‌డేస్తోంది. టీనా లేఖ‌పై సోష‌ల్ మీడియాలో ప్ర‌శంస‌ల వ‌ర్షం కురుస్తోంది.

టీడీపీ నీచరాజకీయాలు చేస్తోంది

బాబు వందల గుళ్లు కూల్చేసినా ఓకేనా

 


×