
గాలి సంపత్ సినిమా విషయంలో దర్శకుడు అనిల్ రావిపూడి ఆది నుంచి మాంచి తెలివిగా వ్యవహరిస్తున్నారు. ప్రారంభంలో జస్ట్ ఆ సినిమా ప్రొడక్షన్ లో భాగస్వామి అన్నారు. అనుకున్న రేంజ్, బజ్ రీచ్ కావాలంటే అది సరిపోదు అని గ్రహించారు.
సినిమాకు దర్శకత్వ పర్యవేక్షణ అనే ట్యాగ్ లైన్ జోడించారు. దీంతో గాలిసంపత్ అనిల్ రావిపూడి సినిమా అనే కలర్ బాగా వచ్చింది. సినిమా గురించి మాట్లాడుకోవడం మొదలైంది. కానీ సబ్జెక్ట్ గురించి లీక్ లు మొదలయ్యాయి.
ఇది తండ్రీ కొడుకుల ఎమోషన్ అని, సెకండాఫ్ అంతా ఇలా అని అలా అని లీకులు వినిపించడం ప్రారంభమైంది. దీంతో గొడవెందుకని, అనిల్ రావిపూడినే కథ మొత్తం ఓపెన్ గా చెప్పేసారు.
రాజేంద్ర ప్రసాద్ మూగవాడు అని, అతనికి అంటూ ఓ సౌండ్ లాంటి భాష వుంటుందని, అతగాడు నూతిలో పడిపోతే జనాలకు ఎలా తెలిసింది? ఎలా బయటకు వచ్చాడు అన్నది కథ అని వెల్లడించేసారు.
పిల్లలను తండ్రి చిన్నప్పుడు చూసుకుంటాడు, పెద్దయ్యాక పిల్లలు తండ్రిని చూసుకోవాలి. ఇది అందరూ చెప్పే మంచి మాటే. దీనినే ఫన్ జోడిచి, ఎమోషనల్ టచ్ ఇచ్చి అనిల్ రావిపూడి చెప్పబోతున్నారు.
సినిమాకు వచ్చేవారు పూర్తిగా అనిల్ రావిపూడి సినిమా టైప్ ఎంటర్ టైన్ మెంట్ మాత్రమే అని ఎక్కడ అనుకుంటారో అని ముందుగానే ప్రిపేర్ చేసేసారు. అదీ ఆయన తెలివి.
సాప్ట్ వేర్ జాబ్ చేసుకుంటూనే సినిమాల్లో నటించా