Advertisement

Advertisement


Home > Movies - Movie News

అప్పుడు సీత అన్నారు.. ఇకపై మహా అంటారు

అప్పుడు సీత అన్నారు.. ఇకపై మహా అంటారు

టాలీవుడ్ లో సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు సినిమాతో గుర్తింపు తెచ్చుకుంది అంజలి. ఆ సినిమాలో ఆమె పోషించిన సీత పాత్రకు మంచి పేరొచ్చింది. చాలామంది ఆమెకు టాలీవుడ్ సీతమ్మ అనే ట్యాగ్ లైన్ కూడా ఇచ్చేశారు. మళ్లీ అంతటి గుర్తింపు నిశ్శబ్దం సినిమాతో వస్తుందని అంటోంది అంజలి.

"నిశ్శబ్దం సినిమాలో మహా అనే క్రైమ్ డిటెక్టివ్ రోల్ చేశాను. చాలా కష్టపడ్డాను. ఫిట్ నెస్ పెంచుకున్నాను. షూటింగ్ అయిన తర్వాత నేరుగా జిమ్ కు వెళ్లేదాన్ని. అట్నుంచి ఇంటికొచ్చి పడుకునేదాన్ని.

లేచి మళ్లీ షూటింగ్. ఇలానే నెలలు గడిచిపోయాయి. అంతెందుకు.. ఈ పాత్ర కోసం నాకెంతో ఇష్టమైన జుట్టు కూడా కత్తిరించేశాను. షార్ట్ హెయిర్ లోకి వచ్చేశాను."

ఇన్నాళ్లూ సీత అని పిలిచిన జనాలు, నిశ్శబ్దం రిలీజైన తర్వాత అంతా తనను మహా  అని పిలుస్తారని నమ్మకంగా చెబుతోంది అంజలి.

చూస్తుంటే.. అనుష్క కంటే ఈ సినిమాపై అంజలి ఎక్కువగా హోప్స్ పెట్టుకున్నట్టుంది. వచ్చే నెల 2న ఈ సినిమా నేరుగా ఓటీటీలో రిలీజ్ అవుతోంది.

చంద్రబాబు వైఎస్ఆర్ ఇంటికొచ్చి డబ్బు ఆడిగేవాడు

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?