Advertisement

Advertisement


Home > Movies - Movie News

నాకు కరోనా సోకలేదు.. హీరోయిన్ ఆవేదన

నాకు కరోనా సోకలేదు.. హీరోయిన్ ఆవేదన

హీరోలు, హీరోయిన్లు చాలామంది తమకు కరోనా సోకిందంటూ పోస్టులు పెట్టడం చూశాం. తమతో ఈమధ్య కాలంలో టచ్ లోకి వచ్చిన వాళ్లంతా విధిగా పరీక్షలు చేయించుకోవాలని విజ్ఞప్తి చేసిన వాళ్లను కూడా చూశాం. కానీ ఫస్ట్ టైమ్ ఓ హీరోయిన్ మాత్రం, తనకు కరోనా సోకలేదంటూ పోస్ట్ పెట్టింది. ఆ హీరోయిన్ పేరు అంజలి.

కొన్ని న్యూస్ ఆర్టికల్స్, వెబ్ సైట్స్ లో తనకు కరోనా సోకినట్టు వార్తలు వచ్చాయని, కానీ తనకు కరోనా సోకలేదని, పూర్తి ఆరోగ్యంతో ఉన్నానంటూ స్టేట్ మెంట్ ఇచ్చింది అంజలి. పరీక్షల్లో తనకు పాటిజివ్ వచ్చిందంటూ వస్తున్న కథనాల్లో ఎలాంటి వాస్తవం లేదంటోంది. అంజలిపై ఇలాంటి ఊహాగానాలు రావడం వెనక, ఆమె ఇలా ప్రకటన చేయడం వెనక ఓ కారణం ఉంది.

వకీల్ సాబ్ ప్రమోషన్ కోసం కొన్ని రోజుల కిందట అంజలి, అనన్య, నివేత థామస్ కలిసి మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలు ఇచ్చిన కొన్ని రోజులకే తనకు కరోనా సోకినట్టు నివేత థామస్ ప్రకటించింది. అందుకే ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కు కూడా హాజరు కాలేదు.

దీంతో అంజలికి కూడా కరోనా సోకిందంటూ పుకార్లు వ్యాపించాయి. ఇవి రోజురోజుకు మరింత ఎక్కువ కావడంతో అంజలి స్వయంగా తన ఆరోగ్య పరిస్థితిపై వివరణ ఇచ్చుకుంది

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?