Advertisement

Advertisement


Home > Movies - Movie News

తెలుగులో నెక్ట్స్ ఓటీటీ రిలీజ్ ఆ సినిమానే?

తెలుగులో నెక్ట్స్ ఓటీటీ రిలీజ్ ఆ సినిమానే?

త‌మ ముందు మ‌రో మార్గం క‌నిపించ‌డం లేద‌ని, లాసెస్ ను రిక‌వ‌రీ చేసుకోవ‌డానికే తాము ఆలోచిస్తున్న‌ట్టుగా చెబుతున్నారు ద‌ర్శ‌కుడు వెంక‌టేష్ మ‌హా. తొలి సినిమా 'కేరాఫ్ కంచ‌ర‌పాలెం' తో దేశం దృష్టిని ఆక‌ర్షించిన ఈ ద‌ర్శ‌కుడు రెండో సినిమాగా ఒక రీమేక్ స‌బ్జెక్ట్ ను ఎంచుకున్నాడు. 'మ‌హేశింటే ప్ర‌తీకారం' అనే మ‌ల‌యాళ సినిమా రీమేక్ దాదాపు పూర్తి అయిన‌ట్టుగా ఉంది. 'ఉమామ‌హేశ్వ‌ర ఉగ్ర‌రూప‌శ్య' పేరుతో ఈ సినిమాను రూపొందించారు.

తాము వేసుకున్న ప్ర‌ణాళిక ప్ర‌కారం ఏప్రిల్ 17న ఈ సినిమా విడుద‌ల కావాల్సింద‌ని ఆ ద‌ర్శ‌కుడు పేర్కొన్నాడు. ఇప్ప‌టికే వీళ్ల గ‌డువు తీరిపోయి రెండో నెల కావొస్తూ ఉంది. ఈ క్ర‌మంలో ఆ సినిమాను ఓటీటీలో విడుద‌ల చేయ‌డం గురించి త‌మ నిర్మాత‌లు ఆలోచిస్తూ ఉన్నార‌ని వెంక‌టేష్ మ‌హా చెప్పాడు. ఈ సినిమా డిజిట‌ల్ స్ట్రీమింగ్ యాప్ లో విడుద‌ల అయ్యే అవ‌కాశాలున్నాయ‌నే అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్టుగా, ఆ విష‌యంలో తాము ఆలోచ‌న‌ల్లో ఉన్న‌ట్టుగా వెంక‌టేష్ మ‌హా చెప్పాడు.

ఇప్ప‌టికే ఒక తెలుగు చోటా సినిమా ఓటీటీలో విడుద‌ల అయ్యింది. త‌మిళ మూవీ మేక‌ర్లు ఈ విష‌యంలో మ‌రి కాస్త ముందున్నారు. ఇప్పుడు తెలుగులో మ‌రో చిన్న సినిమా డిజిట‌ల్ స్ట్రీమింగ్ యాప్ లో విడుద‌ల అయ్యే అవ‌కాశాలు క‌నిపిస్తూ ఉన్నాయి. థియేట‌ర్లు తెర‌వ‌డం గురించి ఇప్పుడు ప్ర‌భుత్వాలు కూడా ఆలోచించ‌డం లేదు. క‌రోనా కేసుల సంఖ్య పెరుగుతూ ఉంది. దీంతో థియేట‌ర్లు తెర‌వ‌డం ఎప్పుడ‌నేది స‌మాధానం లేని ప్ర‌శ్న‌లానే ఉంది. ఈ నేప‌థ్యంలో మ‌రి కొన్ని రెడీ అయిన సినిమాల‌కు డిజిటల్ స్ట్రీమింగ్ యాప్సే మార్గం అయ్యేలా ఉన్నాయి.

మూడు చానల్స్ రెండు పేపర్లతో రాజకీయం

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?