అంటే..సుందరానికి..నిజమేగా

నాని 28వ సినిమా, దర్శకుడు వివేక్ ఆత్రేయ రెండో సినిమా ప్రకటన కొద్ది రోజల క్రితం వచ్చింది. మైత్రీ మూవీస్ నిర్మించే ఈ సినిమాకు ' అంటే..సుందరానికి..' అనే టైటిల్ పెడుతున్నారని గ్రేట్ ఆంధ్ర…

నాని 28వ సినిమా, దర్శకుడు వివేక్ ఆత్రేయ రెండో సినిమా ప్రకటన కొద్ది రోజల క్రితం వచ్చింది. మైత్రీ మూవీస్ నిర్మించే ఈ సినిమాకు ' అంటే..సుందరానికి..' అనే టైటిల్ పెడుతున్నారని గ్రేట్ ఆంధ్ర ముందే వెల్లడించింది. 

ఈ రోజు ఆ టైటిల్ నే అనౌన్స్ చేసారు. కాస్త ఫన్నీగా వివేక్ ఆత్రేయ స్టయిల్ ప్రతిబింబించేలా చిన్నవిడియోను తయారుచేసి, టైటిల్ ను ప్రకటించారు. 

ఈ టైటిల్, ఆ విడియో వ్యవహారం అంతా చూస్తుంటే,.ఇక ముందుగా తెలుస్తున్న మరో అప్ డేట్ ఏమిటంటే, ఈ సినిమాలో హీరోకి 'ఆ విషయం' లేదన్న గ్యాసిప్ గట్టిగా వినిపిస్తూ వుంటుందని. 

కానీ 'ఆ విషయం' లేని వాడి వల్లే తనకు ఏదో అయిపోయిదని, హీరోయిన్ కిందా మీదా హడావుడి చేస్తుందన్నది పాయింట్ అని ఇండస్ట్రీలో వినిపిస్తోంది. 

అది నిజమో కాదో కానీ ఇంట్రస్ట్రింగ్ గా వుంది. నాని లాంటి క్లాస్ ప్లస్ యూత్ ఎంటర్ టైనర్ కు పక్కాగానప్పేలాగే వుంది. 

నానితో గ్యాంగ్ లీడర్ లాంటి సినిమా తీసి, చేతులు కాల్చుకున్న మైత్రీ మూవీస్ ఈసారి ఆ తప్పు చేయకుండా సరైన సబ్జెక్ట్ ను ఎన్నుకున్నట్లు కనిపిస్తోంది.