Advertisement

Advertisement


Home > Movies - Movie News

చరణ్ తో సినిమా.. మూతి ముడుచుకున్న హీరోయిన్

చరణ్ తో సినిమా.. మూతి ముడుచుకున్న హీరోయిన్

రంగస్థలం సినిమాలో హీరోయిన్ గా ముందు అనుపమ పరమేశ్వరన్ ను అనుకున్నారు. ఆ తర్వాత ఆ స్థానంలో సమంతను తీసుకున్నారు. అలా ఓ బ్లాక్ బస్టర్ మూవీని అనుపమ మిస్ అయిపోయింది. అయితే ఈ మేటర్ ను ఆమె మరిచిపోయిందేమో కానీ, చాలామంది నెటిజన్లు మాత్రం ఇంకా మరిచిపోయినట్టు లేదు. అందుకే సమయం దొరికినప్పుడల్లా మరోసారి గుర్తుచేస్తున్నారు.

ఈరోజు అనుకోకండా సోషల్ మీడియాలోకొచ్చింది అనుపమ. తనకు బోర్ కొడుతోందని, ఎవరైనా క్రేజీ క్వశ్చన్స్ అడిగితే ఆన్సర్ చేస్తానని ఊరించింది. వెంటనే కొంతమంది లైన్లోకి వచ్చారు. వాటికి అనుపమ కూడా క్రేజీగా సమాధానాలిచ్చింది. అయితే ఊహించని విధంగా రంగస్థలం సినిమాను పరోక్షంగా గుర్తుచేస్తూ ప్రశ్న ఒకటి పడింది.

"నీది, రామ్ చరణ్ కాంబోలో సినిమా చూడొచ్చా" అనేది ఆ ప్రశ్న. అప్పటివరకు సరదాగా సమాధానాలిచ్చిన అనుపమ కాస్త మూడ్-అవుట్ అయింది. అదో రకంగా పక్కకు చూస్తూ దిగిన సెల్ఫీని పోస్ట్ చేసి ఊరుకుంది. దానిపై స్పందించడం ఇష్టం లేదన్నట్టుంది ఆ సెల్ఫీ.

మొత్తమ్మీద రంగస్థలం ఇష్యూను అనుపమ మరిచిపోయినా జనాలింకా గుర్తుపెట్టుకున్నట్టు కనిపిస్తోంది. మరోవైపు ఇదే ఛాటింగ్ లో తన ఫిజిక్ పై కూడా రియాక్ట్ అయింది అనుపమ. మొన్నటివరకు సన్నగా మారానని, ఇప్పుడు మరోసారి తన పాత లుక్ లోకి బొద్దుగా మారేందుకు ప్రయత్నిస్తున్నానని చెప్పుకొచ్చింది. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?