cloudfront

Advertisement


Home > Movies - Movie News

ఎట్టకేలకు మరో సినిమాకు ఓకే చెప్పిన అనుష్క

ఎట్టకేలకు మరో సినిమాకు ఓకే చెప్పిన అనుష్క

బాహుబలి-2 తర్వాత ఇప్పటివరకు మరో సినిమాకు ఓకే చెప్పలేదు అనుష్క. రీసెంట్ గా వచ్చిన భాగమతి కూడా బాహుబలి-2 కంటే ముందే ఓకే చేసిన సినిమానే తప్ప, కొత్త ప్రాజెక్టు కాదు. ఓవైపు ఆమె పెళ్లిపై పుకార్లు వస్తున్న నేపథ్యంలో.. అనుష్క ఇక కొత్త సినిమాలకు కమిట్ అవ్వదని అంతా అనుకున్నారు. కానీ తన వద్దకొచ్చిన కథల్లో ఓ కథను ఫైనలైజ్ చేసే పనిలో ఉంది బొమ్మాలి.

తనకు కథలు చెప్పేవాళ్లు తగ్గిపోయారంటూ ఆమధ్య ప్రకటించి సంచలనం సృష్టించిన అనుష్క, తన వద్దకొచ్చిన 2-3 కథల్లో మంచి స్టోరీని ఎంచుకునే పనిలో పడింది. వీటిలో దర్శకుడు గౌతమ్ మీనన్ చెప్పిన స్టోరీ కూడా ఉంది. ఆ స్టోరీలైన్ కే అనుష్క ఓటేసినట్టు సమాచారం.

ప్రస్తుతం విక్రమ్ సినిమాతో బిజీగా ఉన్నాడు గౌతమ్ మీనన్. అటు అనుష్క కూడా బరువు తగ్గే పనిలో బిజీగా ఉంది. విక్రమ్ తో చేస్తున్న ధృవనక్షత్రం సినిమా విడుదలకు సిద్ధమైంది. ఇది రిలీజ్ అయిన వెంటనే అనుష్కతో చేయబోయే సినిమాపై ఓ క్లారిటీ వస్తుంది.

రెగ్యులర్ కమర్షియల్ మూవీస్ కు అనుష్క దూరమనే విషయం తెలిసిందే. సినిమాల్లో ఇలా వచ్చి నాలుగు స్టెప్పులేసి అలా వెళ్లిపోయే పాత్రల్ని ఆమె అంగీకరించదు. కథ మొత్తం ఆమె చుట్టూనే తిరగాలి. అలాంటి స్టోరీనే సిద్ధం చేశాడట గౌతమ్ మీనన్. ఎప్పట్లానే ఈ సినిమాలో కూడా సరికొత్త మేకోవర్ లో ఆమె కనిపిస్తుందట.