cloudfront

Advertisement


Home > Movies - Movie News

స్టన్నింగ్ బొమ్మాలి: స్లిమ్ లుక్ సూపర్

స్టన్నింగ్ బొమ్మాలి: స్లిమ్ లుక్ సూపర్

మొత్తానికి బొమ్మాలి బరువు తగ్గింది. స్లిమ్ లుక్ తో అదరగొట్టింది. భాగమతి తర్వాత ఇప్పటివరకు సెట్స్ పైకి రాని ఈ ముద్దుగుమ్మ పూర్తిగా బరువు తగ్గడంపైనే ఫోకస్ పెట్టింది. విదేశాలకు వెళ్లి, ఫారిన్ ట్రయినర్ పర్యవేక్షణలో ఆరోగ్యాన్ని కాపాడుకుంటూనే సహజ పద్ధతిలో బరువు తగ్గింది.

అలా స్లిమ్ గా మారిన అనుష్క ఫస్ట్ టైం ఓ ఫొటోషూట్ లో పాల్గొంది. అందులోంచి 2 స్టిల్స్ రిలీజ్ చేశారు. ఆ ఫొటోలు చూస్తుంటే అనుష్క సన్నబడిన విషయం స్పష్టంగా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

లేటెస్ట్ మేకోవర్ తో త్వరలోనే ఓ సినిమాలో నటించబోతోంది అనుష్క. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిలిం కార్పొరేషన్ బ్యానర్లపై హేమంత్ మధుకర్ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాకు సైలెన్స్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. వచ్చే నెల నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలుకానుంది.

మాధవన్, అనుష్క హీరోహీరోయిన్లుగా రాబోతున్న ఈ సినిమాలో షాలినీ పాండే, అంజలి, అవసరాల శ్రీనివాస్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. భాగమతి తర్వాత అనుష్క చేయబోతున్న మూవీ ఇదే.