cloudfront

Advertisement


Home > Movies - Movie News

సౌత్ సినిమాలో అనుష్కా శర్మ?

సౌత్ సినిమాలో అనుష్కా శర్మ?

సౌత్ లో ఇప్పుడు బాలీవుడ్ హీరోయిన్లకు మళ్లీ క్రేజ్ పెరిగినట్టుగా ఉంది. ఒకవైపు ఇక్కడి స్టార్ హీరోల సినిమాల్లో బాలీవుడ్ హీరోయిన్లకు ప్రాధాన్యతను ఇస్తూ ఉన్నారు. ప్రస్తుతం షూటింగ్ దశల్లో ఉన్న వివిధ సినిమాల్లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్లను నటింపజేస్తూ ఉన్నారు. మరికొందరి విషయంలో ప్రతిపాదనలు నడుస్తూ ఉన్నాయి.

ఇంకోవైపు తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ లో కంగనా రనౌత్ ను టైటిల్ రోల్ లో చూపుతూ ఉన్నారు. ఈ పరంపరలో అనుష్క శర్మను కూడా సౌత్ లో నటింపజేసే ప్రయత్నం సాగుతోందని సమాచారం.

ఈమె బాలీవుడ్ లో తీసిన 'పరి' సినిమాను తమిళంలో రీమేక్ చేస్తూ ఉన్నారట. తమిళంలో కూడా ఆమెనే ప్రధాన పాత్రలో నటింపజేయాలని అనుకుంటున్నారట. అయితే 'పరి' సినిమా హిందీలో ప్లాప్. విడుదల అయిన రోజు నుంచినే ఆ సినిమాకు డివైడ్ టాక్ వచ్చింది. హిట్ కాలేదు.

అయినా ఎందుకో ఆ సినిమాను తమిళంలో రీమేక్ చేస్తూ ఉన్నారట. అది నిర్మాతల ఆనందం కావొచ్చు. ఇప్పుడు 'పరి' రీమేక్ లో అనుష్కా శర్మనే నటింపజేయాలని అనుకుంటున్నారట. ఒక ఫెయిల్ అయిన సినిమాను రీమేక్ చేయడానికి నిర్మాతలు రెడీగా ఉన్నా, ఆ సినిమాలో మళ్లీ నటించేందుకు అనుష్కా శర్మ రెడీగా ఉంటుందా?

పవనం ఏడాది పొడుగునా.. ఋతుపవనం సీజనల్‌.. మరి పవన్