మలైకా బాయ్ ఫ్రెండ్ కు కరోనా

బాలీవుడ్ హీరో, నిర్మాత బోనీ కపూర్ తనయుడు, మలైకా అరోరా బాయ్ ఫ్రెండ్ అర్జున్ కపూర్ కరోనా బారిన పడ్డాడు. ఈ విషయాన్ని స్వయంగా ఆ హీరో బయటపెట్టాడు. తనకు కరోనా సోకిందని, కానీ…

బాలీవుడ్ హీరో, నిర్మాత బోనీ కపూర్ తనయుడు, మలైకా అరోరా బాయ్ ఫ్రెండ్ అర్జున్ కపూర్ కరోనా బారిన పడ్డాడు. ఈ విషయాన్ని స్వయంగా ఆ హీరో బయటపెట్టాడు. తనకు కరోనా సోకిందని, కానీ ఎలాంటి లక్షణాలు లేవని బయటపెట్టాడు ఈ హీరో.

“నాకు కరోనా సోకింది. నా బాధ్యతగా ఈ విషయాన్ని అందరికీ చెబుతున్నాను. నేను బాగానే ఉన్నాను, నాకు ఎలాంటి లక్షణాల్లేవు. వైద్యుల సూచన మేరకు నేను హోం క్వారంటైన్ లోకి వెళ్లిపోయాను. ప్రస్తుతం ఊహించలేని విధంగా కాలం మారిపోయింది. అందరం గడ్డు పరిస్థితిలో ఉన్నాం. ఈ వైరస్ నుంచి మనమంతా బయటపడతామనే నమ్మకం నాకు ఉంది.”

తన ఆరోగ్య పరిస్థితిపై ఎలాంటి పుకార్లు తలెత్తకుండా ఉండేందుకు.. రాబోయే రోజుల్లో ఇకపై తన ఆరోగ్య పరిస్థితిపై తానే అప్ డేట్స్ ఇస్తానని కూడా స్పష్టంచేశాడు అర్జున్ కపూర్.

బోనీకపూర్ తనయుడిగా పరిశ్రమలో అడుగుపెట్టిన అర్జున్ కపూర్.. 2 స్టేట్స్, ఇష్క్ జాదే, హాఫ్ గర్ల్ ఫ్రెండ్ లాంటి సినిమాలతో పాపులర్ అయ్యాడు. అయితే సినిమాల కంటే.. తనకంటే ఎంతో పెద్దదైన మలైకాతో డేటింగ్ చేస్తూ ఇంకా ఎక్కువ పాపులర్ అయ్యాడు.