Advertisement

Advertisement


Home > Movies - Movie News

రీమేక్ అయ్యాకా.. అర్జున్ రెడ్డి మళ్లీ డబ్బింగ్!

రీమేక్ అయ్యాకా.. అర్జున్ రెడ్డి మళ్లీ డబ్బింగ్!

బాలీవుడ్ జనాలకు 'అర్జున్ రెడ్డి' మీద మమకారం ఏ మాత్రం తగ్గినట్టుగా లేదు. తెలుగులో సంచలన విజయం సాధించిన ఈ సినిమా బాలీవుడ్ లో రీమేక్ అయిన సంగతి తెలిసిందే. షాహిద్ కపూర్ హీరోగా రూపొందిన ఆ సినిమా సంచలన విజయం సాధించింది. అత్యంత భారీ కలెక్షన్లను కూడా సాధించింది.

అలా బాలీవుడ్ లో 'అర్జున్ రెడ్డి' ని సూపర్ హిట్ చేసిన అక్కడి వాళ్లు ఆ సినిమా మీద ఇంకా మోజును కలిగే ఉన్నారు. విజయ్ దేవరకొండను ప్రత్యేకంగా అక్కడి టీవీ చానళ్లు చర్చాకార్యక్రమాలకు పిలుస్తున్నాయి. అదంతా అర్జున్ రెడ్డి పుణ్యమే! ఇక అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ట్విటర్ పై బాలీవుడ్ మీడియా ఒక కన్నేసి ఉంచింది.

ఆ సంగతలా ఉంటే..  అర్జున్ రెడ్డిని డబ్బింగ్ కూడా చేశారు. విజయ్ దేవరకొండ-షాలినీ పాండే జంటగా సందీప్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన సినిమాను హిందీలోకి అనువదించారు. టీవీలో ఆ సినిమా ప్రీమియర్ షోను వేయబోతున్నారు. 'ఒరిజినల్ అర్జున్ రెడ్డిని చూడండి..'అంటూ స్టార్ గోల్డ్ లో ఒక యాడ్ కూడా వేస్తున్నారు. 'కబీర్ సింగ్'  ఉన్నప్పటికీ వాళ్లు మళ్లీ 'అర్జున్ రెడ్డి'ని ప్రత్యేకంగా ప్రమోట్ చేసి  చూపిస్తుండటం, అక్కడ ఆ సినిమాకు ఉన్న క్రేజ్ ఏ రేంజ్ ఏమిటో చాటి చెబుతోంది! 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?