cloudfront

Advertisement


Home > Movies - Movie News

ఇది అవసరాల మార్క్ టైటిల్

ఇది అవసరాల మార్క్ టైటిల్

అచ్చమైన తెలుగు పదాలతో టైటిల్స్ పెట్టడం, సినిమాల్లో తెలుగు భాషకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం అవసరాల శ్రీనివాస్ స్టయిల్. ఇప్పటివరకు తను తీసిన రెండు సినిమాల్లో ఇదే స్టయిల్ ఫాలో అయ్యాడు ఈ దర్శకుడు కమ్ నటుడు. ఇప్పుడు తన మూడో సినిమాకు కూడా అదేదారిలో వెళ్తున్నాడు. నాగశౌర్య హీరోగా త్వరలోనే చేయబోతున్న ఓ సినిమాకు తెలుగుదనం ఉట్టిపడే మంచి టైటిల్ ఫిక్స్ చేశాడు.

అవును.. దర్శకుడిగా తన మూడో సినిమాకు "ఫలానా అబ్బాయి-ఫలానా అమ్మాయి" అనే టైటిల్ ఫిక్స్ చేశాడు అవసరాల శ్రీనివాస్. వినడానికే టైటిల్ కాస్త క్యాచీగా ఇంట్రెస్టింగ్ ఉంది. సినిమా ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందంటున్నాడు అవసరాల. సినిమాలో నాగశౌర్య సరసన మాళవిక నాయర్ హీరోయిన్ గా నటించనుంది.

తన తొలి సినిమాకు ఊహలు గుసగుసలాడే అనే మంచి టైటిల్ పెట్టిన అవసరాల, తన రెండో సినిమాకు కథ ప్రకారం జ్యో అచ్యుతానంద అనే మరో డిఫరెంట్ టైటిల్ పెట్టాడు. ఇప్పుడు తన మూడో సినిమాకు ఇలా "ఫలానా అబ్బాయి-ఫలానా అమ్మాయి" అనే పేరుపెట్టి అందర్నీ ఎట్రాక్ట్ చేశాడు.

ఇదొక పక్కా ప్రేమకథ అనే విషయం టైటిల్ చూస్తేనే అర్థమౌతోంది. పీపుల్ మీడియా, దాసరి ప్రొడక్షన్స్ బ్యానర్లపై త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి రాబోతోంది. 

మీ ఓటు ఉందో లేదో.. ఇలా నిర్ధారించుకోండి!

బాబుది ఎదురుదాడే.. నిజాన్ని ఎదుర్కొనలేరు!