cloudfront

Advertisement


Home > Movies - Movie News

అవును వాళ్లిద్దరూ విడిపోయారు

అవును వాళ్లిద్దరూ విడిపోయారు

సరిగ్గా సంవత్సరం కిందటి సంగతి. జై అనే హీరో తమిళనాట ఏదో మారుమూల ఓ సినిమా షూటింగ్ లో ఉన్నాడు. పనిగట్టుకొని మరీ అక్కడికెళ్లింది అంజలి. తన బాయ్ ఫ్రెండ్ కు సడెన్ సర్ ప్రైజ్ ఇవ్వడంతో పాటు అదే సెట్స్ లో అతడి పుట్టినరోజును తన సొంత ఖర్చుతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసింది. 

జై-అంజలి సహజీవనం గురించి అందరికీ తెలిసిందే. చెన్నైలో ఇద్దరూ ఒకే అపార్ట్ మెంట్ లో ఉండేవారు. ఇక పెళ్లి ఒక్కటే బ్యాలెన్స్ అనుకున్న టైమ్ కు బంధానికి బీటలువారాయి. ఏమైందో ఏమో ఇద్దరూ విడిపోయారు. జై తనకు కేవలం ఫ్రెండ్ మాత్రమే అంటూ మాట మార్చేసింది అంజలి. 

వీళ్లిద్దరు విడిపోయారనే విషయం తాజాగా మరోసారి రుజువైంది. నిన్న అంజలి తన పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకుంది. కోలీవుడ్ కు చెందిన ఎంతోమంది ప్రముఖులు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. జై మాత్రం అస్సలు రియాక్ట్ అవ్వలేదు. ట్విట్టర్, ఫేస్ బుక్ లో ఎక్కడా అంజలి ప్రస్తావన లేదు. 

రీసెంట్ గా వీళ్లిద్దరూ కలిసి బెలూన్ అనే సినిమా చేశారు. ఇదే వీళ్లిద్దరూ కలిసి చేసిన చివరి సినిమా అవుతుందంటున్నారు కోలీవుడ్ జనాలు. జై-అంజలి కలవడం దాదాపు అసాధ్యం అంటున్నారు. అంజలి మేటర్ ను పక్కనపెట్టి వరుసగా సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు జై. ఇటు అంజలి కూడా తన పుట్టినరోజు సందర్భంగా కోన వెంకట్ బ్యానర్ పై గీతాంజలి-2 సినిమా ప్రకటించింది.