cloudfront

Advertisement


Home > Movies - Movie News

బ్యాడ్‌ ప్లానింగ్‌తో బోల్తా పడ్డాడు

బ్యాడ్‌ ప్లానింగ్‌తో బోల్తా పడ్డాడు

సక్సెస్‌ రావడం కంటే దానిని నిలబెట్టుకోవడం కష్టమని అంటారు. చాలా తక్కువ మంది మాత్రమే వచ్చిన సక్సెస్‌ని నిలబెట్టుకుని మెట్టు మెట్టుగా ఎదుగుతుంటారు. నాగశౌర్యలాంటి చాలా మంది వచ్చిన విజయాన్ని నిలుపుకోలేక పరాజయాలు కొని తెచ్చుకుంటారు. 'ఛలో' చిత్రం విజయవంతం అయినపుడు నాగశౌర్యని అంతా మెచ్చుకున్నారు.

తన సక్సెస్‌ స్టోరీ తానే రాసుకున్నాడని, తన భవిష్యత్తుని తానే మార్చుకున్నాడని ప్రశంసించారు. కానీ ఛలో విజయానందం ఎక్కువ కాలం నిలవలేదు. అంతకుముందు చేసిన కణం, అమ్మమ్మగారిల్లు చిత్రాలు విడుదలై ఫ్లాపయ్యాయి. వాటిపై నమ్మకం వున్నా, లేకున్నా తాను నటించిన సినిమాలు కనుక తనవంతుగా వాటిని ప్రమోట్‌ చేయాలి.

కానీ ఏవో కారణాలు చెప్పి ఆ చిత్రాలు పూర్తిగా పరాజయం పాలవడానికి తనవంతు చెయ్యేసాడనే చెప్పాలి. 'ఛలో' తర్వాత 'నర్తనశాల' చిత్రాన్ని స్వీయ నిర్మాణంలో తీసాడు. ఈసారి కూడా యువ దర్శకుడిని నమ్మి, వినోదాత్మక విలువలున్న కథని ఎంచుకున్నాడు. అయితే ఆ చిత్రం ఎలా రూపొందుతోందనేది గుర్తించలేకపోయాడు.

నర్తనశాల చూసిన ప్రతి ఒక్కరూ పెదవి విరుస్తున్నారు. ఛలోతో వచ్చిన గుడ్‌విల్‌ మొత్తం ఈ చిత్రంతో పాడు చేసుకున్నాడు. బ్యాడ్‌ ప్లానింగ్‌తో తనకి వచ్చిన బ్రేక్‌ని వృధా చేసుకుని మళ్లీ మునుపటి స్థానానికి వచ్చేసాడు.