cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Movie News

బాలయ్య సినిమాకు రికార్డు రేటు

బాలయ్య సినిమాకు రికార్డు రేటు

సరైన హిట్ అన్నది పడి చాలా కాలం అయింది. నిర్మాతల సంగతి అలా వుంచితే సినిమా కొన్న డిస్ట్రిబ్యూటర్లు డబ్బులు చేసుకుని చాన్నాళ్లయింది. ఇదంతా బాలకృష్ణ సినిమాల సంగతే. కానీ బాలయ్య-బోయపాటి కాంబినేషన్ లో వస్తున్న సినిమా అంటే మాత్రం హాట్ కేక్ లా వుంది. 

ఆ సినిమాకు ఆంధ్ర ఏరియా 35 కోట్లు చెబుతున్నారు. కొన్ని ఏరియాలకు ఇధ్దరు ముగ్గురు పోటీ పడుతున్నారు అంటే ఏమనుకోవాలి? బాలయ్య మీద మోజా? బోయపాటి మీద నమ్మకమా?

బిబి 3 సినిమాను డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు నైజాం, ఉత్తరాంధ్ర ఏరియాలు రెండిటికీ కలిపి 19 కోట్లకు తీసుకున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలే నిజమైతే ఇది నిజంగా కాస్త చెప్పుకోవాల్సిన విషయమే. 

ఇప్పటి వరకు వైజాగ్ ఏరియాలో బాలయ్య సినిమాల ఏవరేజ్ రేటు నాలుగు కోట్లకు అటు ఇటు మాత్రమే. కానీ కరోనా తరువాత మారిన కలెక్షన్ల లెక్కల నేపథ్యంలో దిల్ రాజు ధైర్యం చేసారని అనుకోవాలి. 

థియేటర్ల రేట్లు పెంచుకునే వెసులుబాటు ఎలాగూ కోర్టులు ఇస్తున్నాయి. అందువల్ల ఫుల్ గానే థియేటర్లు పరిచేసి ముందుగానే మాగ్జిమమ్ లాగేసే అవకాశం వచ్చింది. అందువల్లే ధైర్యం చేస్తున్నారేమో? బిబి 3 పీక్ సమ్మర్ సీజన్ లో మే 28న విడుదలవుతుంది. 

తెలంగాణలో రాజన్న రాజ్యం

ఇది చాలా కష్టం మోహన్ బాబూ

 


×