cloudfront

Advertisement


Home > Movies - Movie News

బాలయ్య మంచోడేగానీ, భయస్తుడు: లక్ష్మీపార్వతి

బాలయ్య మంచోడేగానీ, భయస్తుడు: లక్ష్మీపార్వతి

నందమూరి బాలకృష్ణ అంటే భయానికి మీనింగ్‌ తెలియని వ్యక్తి.. అని ఆయన అభిమానులు చెబుతుంటారు. 'మా బ్లడ్‌ వేరు, మా బ్రీడ్‌ వేరు..' అని చెప్పుకోవడమూ బాలయ్యకు కొత్తకాదు. కానీ, స్వర్గీయ ఎన్టీఆర్‌ సతీమణి లక్ష్మీపార్వతి మాత్రం బాలకృష్ణను భయస్తుడిగా అభివర్ణించారు. 'ఎన్‌టిఆర్‌ బయోపిక్‌'పై తాజాగా స్పందించిన లక్ష్మీపార్వతి, బాలయ్యను మంచోడిగా పేర్కొన్నారు గానీ, చంద్రబాబుకి భయపడుతున్న బాలయ్య.. అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

'ఎన్‌టిఆర్‌ బయోపిక్‌' పూర్తిగా చంద్రబాబు కనుసన్నల్లోనే రూపొందిందని ఆరోపించిన లక్ష్మీపార్వతి, స్వర్గీయ ఎన్టీఆర్‌కి సంబంధించి పూర్తి వాస్తవాలు 'లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌'లో కన్పిస్తాయని చెబుతున్నారు. రామ్‌గోపాల్‌ వర్మకి మాత్రమే 'ఎన్‌టిఆర్‌ బయోపిక్‌'ని ధైర్యంగా తెరకెక్కించే సత్తా వుందన్నది లక్ష్మీపార్వతి వాదన. నిన్ననే, 'లక్ష్మీపార్వతి' సినిమాకి సంబంధించి 'ఎందుకు?' అంటూ ఓ పాటని వర్మ, సోషల్‌ మీడియాలో విడుదల చేసిన విషయం విదితమే. ఆ పాట వచ్చాక, వర్మ మీద గౌరవం మరింత పెరిగిందని అంటున్నారు లక్ష్మీపార్వతి.

ఇక, బాలకృష్ణ నిర్మించిన 'ఎన్‌టిఆర్‌ బయోపిక్‌' రెండు పార్టులుగా వస్తున్నా, అది పూర్తిస్థాయిలో ఎన్టీఆర్‌ జీవితాన్ని ఆవిష్కరించే అవకాశమే లేదని లక్ష్మీపార్వతి తేల్చిచెప్పారు. 'ఎన్‌టిఆర్‌ బయోపిక్‌' చూడాల్సిందిగా తనను ఎవరూ ఆహ్వానించలేదనీ, ఆ సినిమా పట్ల ఎన్టీఆర్‌ నిజమైన అభిమానుల్లోనూ ఆసక్తి లేదని, అందరూ 'లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌' సినిమా రిలీజ్‌ కోసం ఎదురుచూస్తున్నారని లక్ష్మీపార్వతి అంటున్నారు.

ఓ వైపు ఎన్టీఆర్‌ అభిమానులు, తెలుగుదేశం పార్టీ శ్రేణులు స్వర్గీయ ఎన్టీఆర్‌ బయోపిక్‌ విడుదల సందడిలో కన్పిస్తోంటే, స్వర్గీయ ఎన్టీఆర్‌ సతీమణి లక్ష్మీపార్వతి మాత్రం, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ ప్రజాసంకల్ప యాత్ర నేటితో పూర్తవుతున్న దరిమిలా, ఆ సంబరాల్లో కన్పిస్తుండడం గమనార్హం.

జగన్‌తో పవన్‌ పొత్తు ఎందుకు కుదరలేదంటే?

టికెట్ దక్కకపోతే డబ్బులు మిగులుతాయ్!