గత కొన్ని రోజులుగా వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన పవర్‌స్టార్ సినిమా సృష్టిస్తున్న సంచలనం అంతాఇంతా కాదు. సోషల్ మీడియాలో పవర్‌స్టార్ అభిమానులు, వర్మ అభిమానులు పరస్పరం తిట్లుకుంటూ హీటెక్కించారు. ఈ సినిమాలో బండ్ల గణేష్ పాత్ర కూడా ఉంది. పరుగునా వచ్చి పవన్‌కల్యాణ్ కాళ్లు పట్టుకున్నట్టు ఒక సీన్ క్రియేట్ చేశారు.
తాజాగా ఈ సినిమాలో తన క్యారెక్టర్‌పై బండ్ల గణేష్ ఒక చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పందించారు. కరోనా తీసుకొచ్చిన మార్పు వల్ల ఈ సినిమాపై స్పందించలేదా అని యాంకర్ ప్రశ్నించారు. ఈ సినిమా విషయంలో కూడా తాను అలా భావించే ఊరుకున్నట్టు బండ్ల గణేష్ చెప్పుకొచ్చారు. పవర్‌స్టార్ ట్రైలర్‌లో తన పాత్ర చూసినప్పుడు చాలా ఫీల్ అయ్యానన్నారు. నాలుగైదు సార్లు ఆ సినిమా మాట్లాడాలని అనుకున్నట్టు తెలిపారు.
ఈ సందర్భంగా బండ్ల గణేష్ స్పందిస్తూ ఆసక్తికర విషయం చెప్పుకొచ్చారు. తన ఊళ్లో తన చిన్నప్పుడు జరిగిన సంఘటన అంటూ చెప్పుకొచ్చాడు. వారణాసిలో చదువుకొని వచ్చిన ఒకాయనకు గ్రామస్తులు బాగా గౌరవం ఇచ్చేవాళ్లన్నారు. కానీ కొంత కాలానికి ఆయన పిచ్చివాడిగా మారాడని తెలిపారు. అంత వరకూ గౌరవించిన వాళ్లే…తర్వాత రోజుల్లో పట్టించుకోవడం మానేశారన్నారు. ఎందుకంటే అతనో పిచ్చి వాడని జాలిపడే వాళ్లన్నారు.
తాను కూడా అట్లా అనుకునే సైలెంట్ అయ్యానన్నారు. అందుకే వదిలేసినట్టు తెలిపారు. ఆ పిచ్చి పనుల వెనుక ఆయన (వర్మ)కో సంతృప్తి, తృఫ్తి ఉందన్నారు. అలాంటప్పుడు మనమేం మాట్లాడుతాం అని బండ్ల ప్రశ్నించారు.
తన వల్ల గౌరవనీయులైన, ఇష్టమైన రాంగోపాల్ వర్మ గారికి వంద రూపాయలు వచ్చినా చాలా హ్యాపీ అని అన్నారు. ఎందుకంటే ఆ వంద రూపాయలతో కనీసం కాఫీ అయినా తాగుతారు కదా అని తెలిపారు. చివరిగా బండ్ల గణేష్ ఏమన్నా రంటే…పిచ్చి బాగా ముదిరి తల పగలి చచ్చిపోతాడని వర్మకు ముగింపు పలికారు. బండ్ల గణేష్ మాటలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి.