సంక్రాంతి బరిలో పక్కాగా దిగే సినిమాల జాబితాలో నాగార్జున-చైతన్యల బంగార్రాజు కూడా వుంది. అది నిన్నటి వరకు. కానీ ఈ రోజు నుంచి ఆలోచన మారినట్లు తెలుస్తోంది. 2022 సంక్రాంతికి పక్కా అంటున్న ఆర్ఆర్ఆర్..భీమ్లా నాయక్…రాధేశ్యామ్ సినిమాల వ్యవహారం తుదిదాకా చూసి అప్పుడు నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది.
సంక్రాంతి విడుదల లక్ష్యంగానే సినిమాను రెడీ చేస్తున్నారు. చేస్తారు. కానీ విడుదల అన్నది మాత్రం డిసెంబర్ నెలాఖరు లోనే డిసైడ్ చేస్తారని తెలుస్తోంది.
సినిమా పబ్లిసిటీకి మూడువారాలు చాలు. రాధేశ్యామ్, భీమ్లా నాయక్ ల్లో ఏ ఒక్కటి అయినా వెనక్కు జరిగితే బంగార్రాజు విడుదల సంక్రాంతికి వుంటుంది. లేదూ అంటే వుండదు. మరో డేట్ చూసుకుంటారు.
ఎందుకంటే ఇన్ని సినిమాల మీద థియేటర్లు దొరకడం అన్నది చాలా అంటే చాలా కష్టం. పైగా ఈ సినిమాను మార్కెట్ చేయాల్సింది జీ టీవీ. ఇన్ని పెద్ద సినిమాల మధ్య అది అంత సులువు కాదు. అందుకే ఈ మూడు సినిమాలు వుంటే వాయిదా అన్నది ఫిక్స్ అని తెలుస్తోంది.