cloudfront

Advertisement


Home > Movies - Movie News

వల్గర్ టాక్.. ఇరకాటంలో పడిన యువ క్రికెటర్లు!

వల్గర్ టాక్.. ఇరకాటంలో పడిన యువ క్రికెటర్లు!

కాఫీ విత్ కరణ్ చాట్ షోలో ఏం మాట్లాడుకుంటారో అందరికీ తెలిసిందే. సినిమా వాళ్లకు అయితే ఆ మాటలు సరిపోతాయి కానీ.. క్రికెటర్లు కూడా అక్కడ కూర్చున్నామని పూనకం వచ్చినట్టగా రెచ్చిపోతే అంతే సంగతులు. ఆ టాక్ షోలో రెచ్చిపోయి మాట్లాడి ఇరకాటంలో పడ్డారు టీమిండియా యంగ్ క్రికెటర్లు హార్ధిక్ పాండ్యా, కేఎల్ రాహుల్.

కాఫీ విత్ కరణ్ షోలో ఆడవాళ్లను కించపరుస్తూ, అనుచితంగా మాట్లాడటంతో వీరిపై సోషల్ మీడియాలో తీవ్రంగా విమర్శలు వచ్చాయి. దీనిపై బీసీసీఐ కూడా స్పందించింది. ఈ ఇద్దరు క్రికెటర్లకూ షోకాజ్ నోటీసులు ఇచ్చింది. చేసిన వ్యాఖ్యానాలపై వివరణ ఇవ్వాలని బీసీసీఐ వీరిని ఆదేశించింది.

దీంతో ఈ క్రికెటర్లకు మైకందిగింది. ఏదో పొరపాటు అయిపోయిందని.. అక్కడ ఆ ఆట్మాస్పియర్ లో ఏదో అలా మాట్లాడేశామని తప్పుంటే క్షమించాలని వీరు ట్వీట్లు పెడుతున్నారు. అక్కడ వల్గర్ కామెంట్లు చేసింది హార్ధిక్ పాండ్యానే. విచిత్రమైన స్టైల్స్ తో కనిపించే పాండ్యా.. అక్కడ తనో ప్లే బాయ్ ని అన్నట్టుగా మాట్లాడాడు.

అమ్మాయిలతో బోలెడన్ని అనుభవాలున్నాయన్నట్టుగా చెప్పుకొచ్చాడు. అంతేగాక.. ఆ విషయాలను తన తల్లిదండ్రులతో కూడా చర్చిస్తానని చెప్పుకొచ్చాడు. తొలిసారి సెక్స్ అనుభవం పొందిన విషయం గురించి కూడా తల్లిదండ్రులతో చెప్పినట్టుగా ఇతడు చెప్పుకొచ్చాడు. అమ్మాయిల విషయంలో అబ్జెక్టివ్ కామెంట్స్ చేశాడు.

కరణ్ టాక్ షోలో సినిమా వాళ్లు ఇలానే మాట్లాడుతూ ఉంటారు. అయితే వాళ్ల కథ వేరు. జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఒక క్రికెటర్ ఇలా మాట్లాడొచ్చా? దీంతో సర్వత్రా విమర్శలు వచ్చాయి. ప్లేబాయ్ ఇమేజ్ వస్తుందని అనుకుంటే.. ఈ ఇద్దరు క్రికెటర్లూ ఇరుక్కుపోయారు.

వీరి విషయంలో బీసీసీఐ కూడా స్పందించింది. బోర్డు కాంట్రాక్టులో ఉన్న క్రికెటర్లు కావడంతో ఇప్పుడు వివరణ ఇవ్వక తప్పని పరిస్థితి. అంతేకాదు.. బోర్డు కాంట్రాక్టులో ఉన్న క్రికెటర్లు ఎవరూ.. స్పోర్ట్స్ షోల్లో మినహా మరే ఎంటర్ టైన్ మెంట్ షోస్ లో కూడా కనిపించకూడదని బోర్డు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.

జగన్‌తో పవన్‌ పొత్తు ఎందుకు కుదరలేదంటే?

టికెట్ దక్కకపోతే డబ్బులు మిగులుతాయ్!