Advertisement

Advertisement


Home > Movies - Movie News

సిద్దార్ధ్ వీడియో.. అసలేం జరిగింది?

సిద్దార్ధ్ వీడియో.. అసలేం జరిగింది?

గోటితో పోయేదానికి గొడ్డలి వరకు తెచ్చుకోవడం అంటే హీరో సిద్దార్ధకు చాలా ఇష్టమైన సంగతి. సింపుల్ గా సమాధానం ఇవ్వరు. ఎంత వరకు జటిలం చేసుకోవాలో అంతకు అంతా చేసుకుంటారు.

నిన్నటికి నిన్న భారతీయుడు 2 సినిమా ప్రెస్ మీట్ లో అలాగే చేసుకున్నారు. మీడియా జనాలు ఎవరిని ఏ ప్రశ్న అడిగినా, తను కూడా దూరిపోయి సమాధానాలు ఇచ్చారు. అది సరే, ఓ మీడియా పర్సన్, ‘మీరు కూడా ప్రభుత్వం అడిగినట్లు యాంటీ డ్రగ్స్ వీడియో చేస్తున్నారా’ అన్న దానికి సిద్దార్ధ నేరుగా సమాధానం ఇవ్వలేదు.

ప్రభుత్వం చెబితే చేయడం కాదు, తాను ఎప్పటి నుంచో ఇలాంటి సామాజిక బాధ్యత కలిగి వున్నాను అంటూ ఏదేదో చెప్పుకువచ్చారు. గమ్మత్తేమిటంటే అంతకు ముందు రోజే ఇండియన్ 2 టీమ్ అంతా యాంటీ డ్రగ్స్ వీడియో బైట్ ఇచ్చారు. సిద్దార్ధ సింపుల్ గా ఆ సంగతే చెప్పవచ్చు. నిన్నే చేసేసాం అని చెప్పేసి ఊరుకోవచ్చు. అది చెప్పకుండా తన చిత్తానికి మాట్లాడారు.

కానీ అక్కడితో అయిపోలేదు. రాత్రి పొద్దుపోయాక సవరణ/వివరణ వీడియో వదిలారు. తన మాటలు తప్పుగా అర్ధం చేసుకున్నారంటూ. దాని వెనుక వేరే సంగతి వుందని తెలుస్తోంది. సిద్దార్ధ సమాధానం సంగతి తెలియగానే ముఖ్యమంత్రి సోదరుడు కొండల్ రెడ్డి ఇండియన్ 2 నైజాం డిస్ట్రిబ్యూటర్లు సురేష్ బాబు, సునీల్ నారంగ్ లతో మాట్లాడినట్లు విశ్వసనీయ వర్గాల బోగట్టా.

సీఎం రాష్ట్ర యువత భవిష్యత్ కోసం ఓ మంచి మాట చెప్పమన్నారు తప్ప, స్వంత ప్రయోజనాల కోసం కాదు కదా అని గట్టిగా క్లాస్ పీకినట్లు తెలుస్తోంది.

దాంతో అప్పటికే విమానం ఎక్కెేసిన, సిద్దార్ధ్ ను అర్జంట్ గా సంప్రదించారు. విమానం దిగగానే కాంట్రాక్ట్ చేసి, వివరణ వీడియో చెేసి వదిలారు. గోటితో పోయేదాన్ని గొడ్డలి వరకు తెచ్చుకోవడం అంటే ఇదే కదా.

 


  • Advertisement
    
  • Advertisement