cloudfront

Advertisement


Home > Movies - Movie News

బెల్లంకొండ అంత స్వీట్‌ ఎందుకు?

బెల్లంకొండ అంత స్వీట్‌ ఎందుకు?

బెల్లంకొండ శ్రీనివాస్‌కి అల్లుడు శీను మినహా సక్సెస్‌ లేదు. ప్రతి సినిమాకీ అతని స్థాయికి మించి ఖర్చు చేయడం, అది ఫ్లాపవడం రివాజు. అలాగని అతను గొప్ప నటుడు కూడా కాదు. ఎన్ని సినిమాలు చేసినా ఇంకా వాచకం, ఆంగికంలో చెప్పుకోతగ్గ మార్పులు లేవు. అటు నటన రాక, ఇటు సక్సెస్‌ లేకపోయినా కానీ బెల్లంకొండ శ్రీనివాస్‌కి అవకాశాలు మాత్రం వెల్లువలా వచ్చి పడుతున్నాయి.

అన్నీ వున్న హీరోలు చాలా మందికి లేనన్ని సినిమాలు బెల్లంకొండకి వస్తున్నాయి. ఏ హీరో అయినా ఫలానా ప్రాజెక్ట్‌ చేయాలని డిసైడ్‌ అయి, తప్పుకుంటే కనుక వెంటనే బెల్లంకొండ దానిని ఎగరేసుకు పోతున్నాడు. మార్కెట్‌ వున్న హీరోకయితే ఇలా ఇన్ని అవకాశాలు వచ్చినా ఓకే కానీ ఇతడిని ఎందుకని ఇలా ఈగల్లా ముసిరేస్తున్నట్టు? బెల్లంకొండ అసలు ఎందుకని అంత స్వీట్‌ అయిపోయాడు?

పారితోషికం విషయంలో పట్టు విడుపులకి తోడు, అతని సినిమాలకి ఏ దశలోను ఆటంకం ఏర్పడని అతని తండ్రి బెల్లంకొండ సురేష్‌ ఇచ్చే భరోసా దీనికి ప్రధాన కారణమట. అలాగే బ్యాక్‌గ్రౌండ్‌లో వుండి సినిమాని నడిపించే సురేష్‌ తన కొడుకు సినిమాలు అన్నిటికీ గ్యారెంటీ రేటు పలికేటట్టు చూసుకుంటాడట.

దీంతో నిర్మాతల పని సులువైపోతోంది. మిగతా హీరోలయితే తమ పని చేసేసి, తమకి రావాల్సింది తీసుకుపోతుంటారు కానీ నిర్మాత భారాన్ని షేర్‌ చేసుకోరు.

ఈ పాయింట్‌లో బెల్లంకొండ స్కోర్‌ చేస్తున్నాడని, అతని సినిమాలకి శాటిలైట్‌, హిందీ డబ్బింగ్‌ తదితర హక్కుల ద్వారా నిర్మాతలకి కూడా రిస్క్‌ వుండడం లేదని, అందుకే అతడి కోసం ఎగబడుతున్నారని టాక్‌.

'గెలవడం అసాధ్యం' అనే లెవల్‌ నుంచి వైఎస్‌ఆర్‌ ఎలా గెలిచారు

డబ్బుంటేనే గెలిచేస్తారా? ఈ ఘనత నిస్సందేహంగా చంద్రబాబుదే!