హాట్ బ్యూటీ చిట్కా… భ‌ర్త‌లు కెవ్వు కేక‌!

బాలీవుడ్ హాట్ బ్యూటీ బిపాసు బ‌సుకు ప్ర‌త్యేక‌మైన అభిమానులున్నారు. గ్లామ‌ర్‌గా క‌నిపించ‌డంలో ఆమెకు ఆమే సాటి. త‌న అంద‌చందాల‌తో యువ‌త‌ను మ‌త్తెక్కించ‌డంలో బిపాసు బ‌సు ఎప్పుడూ ముందు వ‌రుస‌లో ఉంటుంది. అందుకే ఆమె అంటే…

బాలీవుడ్ హాట్ బ్యూటీ బిపాసు బ‌సుకు ప్ర‌త్యేక‌మైన అభిమానులున్నారు. గ్లామ‌ర్‌గా క‌నిపించ‌డంలో ఆమెకు ఆమే సాటి. త‌న అంద‌చందాల‌తో యువ‌త‌ను మ‌త్తెక్కించ‌డంలో బిపాసు బ‌సు ఎప్పుడూ ముందు వ‌రుస‌లో ఉంటుంది. అందుకే ఆమె అంటే అభిమానులు లొట్ట‌లేసుకుంటూ చూస్తారు.

వెండితెర‌పై అంత‌లా అల‌రించిన బిపాసు న‌టుడు క‌ర‌ణ్‌సింగ్ గ్రోవ‌ర్‌ని పెళ్లాడి జీవితాన్ని ఎంజాయ్ చేస్తోంది. ఇద్ద‌రూ క‌లిసి కొన్ని చిత్రాల్లో న‌టించారు కూడా. దంప‌తులిద్ద‌రూ క‌లిసి న‌టిస్తే ఎలాంటి ప్ర‌యోజ‌నాలుంటాయ‌నే ప్ర‌శ్న‌కు ఆమె గ‌మ్మ‌త్తైన స‌మాధానాలిచ్చారు.

భార్యాభర్తలు కలిసి నటిస్…ఆ ఫీలింగే ఎంతో బాగుంటుంది. నిజంగా క‌లిసి న‌టించే అవ‌కాశం వ‌స్తే అంత‌కంటే ఆనందం ఏముం టుంది? ద‌ంప‌తులిద్ద‌రూ క‌లిసి న‌టిస్తే  చాలా ఉపయోగాలున్నాయన్నారు. భావోద్వేగాలను పండించేందుకు న‌టించాల్సిన అవ‌స‌రం రాద‌న్నారు.  చాలా సహజంగా వాటిక‌వే పలుకుతాయ‌న్నారు. ముఖ్యంగా శృంగార, ప్రణయ సన్నివేశాల్లో నటించడం చాలా సులువ‌వుతుంద‌ని ఆమె చెప్పుకొచ్చారు.

ఇదే సంద‌ర్భంలో దంపతుల మధ్య ప్రేమానురాగాలు పెరగాలంటే ఏం చేయాల‌నే ప్ర‌శ్న‌కు ఓ చ‌క్క‌టి చిట్కా కూడా చెప్పారామె.

రోజూ పడుకునే ముందు భర్తలందరూదు ఓ అరగంట పాటు భార్య పాదాలకు మసాజ్‌ చేస్తే చాలని, భార్యలు ఎంతో ప్రేమను త‌మ హృద‌యాల్లో దాచుకుంటార‌న్నారు. త‌న కరణ్‌ అలాగే చేస్తాడని మురిసిపోతూ  చెప్పారు బిపాసా. ఏం చెప్పినా, ఏం చేసినా బిపాసా త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌త‌ను చాటుకోవ‌డం ఆమె నైజం. బిపాసా చిట్కా వింటే భ‌ర్త‌లు కెవ్వుమ‌నాల్సిందే మ‌రి!

చంద్రబాబుకి తెలంగాణాలో నోరెత్తే దమ్ములేదు

జగన్ ని ఎలా దెబ్బ కొట్టాలి