cloudfront

Advertisement


Home > Movies - Movie News

'భరత్' టార్గెట్.. @110 కోట్లు షేర్

'భరత్' టార్గెట్.. @110 కోట్లు షేర్

175కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసి, టాలీవుడ్ లో నాన్ బాహుబలి రికార్డు తనదే అంటూ సగర్వంగా ప్రకటించింది రంగస్థలం యూనిట్. సరిగ్గా విడుదలయిన మూడోవారాల్లో వస్తున్న భరత్ అనే నేనుకు ఇది సవాల్. ఇదే టార్గెట్.

రంగస్థలం సినిమా రెండు వారాలకు వరల్డ్ వైడ్ గా దాదాపు 100కోట్ల షేర్ వసూలు చేసింది. అప్పుడు కానీ వరల్డ్ వైడ్ గా బయ్యర్లు అంతా ఖర్చులు కూడా రాబట్టుకుని, ప్రాఫిట్ జోన్ లోకి రాలేదు. 78కోట్ల రేంజ్ లో అమ్మిన సినిమా రంగస్థలం. పదిశాతం ఖర్చులు, పదిశాతం కమిషన్ కలుపుకుంటే ఈ వంద కోట్లు ఫిగర్ అన్నది ఫుల్ హ్యాపీ ఫిగర్.

మరి 99కోట్ల రేంజ్ లో అమ్మకాలు జరిపిన సినిమా భరత్ అనే నేను. మరి దానికి కమిషన్ సంగతి అలా వుంచినా కేవలం ఖర్చులు గిట్టుబాటు కావాలన్నా నూట పది కోట్లు షేర్ రావాలి. అలా 110కోట్లు షేర్ వస్తే, రంగస్థలం నాన్ బాహుబలి రికార్డు ఆనందం గట్టిగా పట్టుమని పది రోజులు కూడా వుండదు. ఇక 10శాతం కమిషన్ కూడా వచ్చిందంటే, మళ్లీ ఇప్పట్లో ఆ రికార్డు చెరపడం కూడా కష్టం అవుతుంది.

అయితే ఈ రికార్డు సాధించడం అన్నది అంత సులువైన విషయం కాదు. రంగస్థలం సినిమాకు వచ్చిన టాక్, నిజంగా నాన్ బాహుబలి రికార్డే అనుకోవాలి. బాహుబలి సినిమా తరువాత అంత ఏకగ్రీవంగా, ఫ్యామిలీ, ఫ్యామిలీలు కదిలి వచ్చేలా టాక్ రావడం అన్నది రంగస్థలం విషయంలోనే సాధ్యమైంది. అది నూటికి నూరుపాళ్లు వాస్తవం.

బాహుబలి 2విడుదల నుంచి రంగస్థలం మధ్యలో చాలా సినిమాలు విడుదలయ్యాయి. హిట్ లు వున్నాయి. బ్లాక్ బస్టర్లు వున్నాయి. ఫ్లాపులు వున్నాయి. కానీ ఇంటిల్లి పాది వెళ్లి చూడాలి అన్న కోరిక మరోసారి రగిలించిన సినిమా రంగస్థలం. అందులో సందేహం లేదు. కానీ అంత టాక్ వచ్చినా కూడా వందకోట్లు షేర్ రావడానికి, అందరూ ప్రాఫిట్ కావడానికి రెండు వారాలు పట్టింది. పైగా రంగస్థలం విడుదల సమయం, ఆ టైమ్ కు వున్న పరిస్థితులు, సరైన సినిమా కోసం జనాల ఎదురు చూపు అంతా వేరు.

మళ్లీ భరత్ అనే నేను విషయానికి వస్తే, మహేష్ బాబు, కొరటాల చరిష్మానే పెద్ద అండ దండ. మహేష్ సినిమా బాగుంది అన్న టాక్ వస్తే డబ్బులకు కొరత వుండదు. అందువల్ల టార్గెట్ రీచ్ కావడం అన్నది రంగస్థలంలా రెండువారాల్లో ఫినిష్ అయిపోతే ఓకె. ఎందుకంటే రెండు వారాల్లో 'నా పేరు సూర్య', మహానటి, మెహబూబా లాంటి సినిమాలు వరుసగా వస్తున్నాయ్. ఇక అప్పుడు కచ్చితంగా సమస్య ఎదురవుతుంది.

అయితే భరత్ కు అన్ని ఏరియాలు టెన్షన్ పెట్టేవి కనిపించడం లేదు ఉత్తరాంధ్ర(8.7 కోట్లు), ఈస్ట్ (6.70) కృష్ణ, గుంటూరు (13.6)వరకు పెద్దగా టెన్షన్ పెట్టకపోవచ్చు. కానీ వెస్ట్ (6కోట్లు), నెల్లూరు (3కోట్లు), సీడెడ్ (12కోట్లు) అన్నవి కాస్త టెన్షన్ వ్యవహారమే. ఇక నైజాం ఎస్టిమేషన్ 22కోట్లు రిలీజ్ త్రూ కాబట్టి, ఎలా వచ్చినా, ఎంత వచ్చినా సమస్య కాదు.

ఇక అన్నింటికన్నా పెద్ద టెన్షన్ ఓవర్ సీస్ తోనే. అక్కడ 16కోట్లు వసూలు చేయాలి. ఇప్పటికి అక్కడ రంగస్థలం సాధించిన షేర్ 12కోట్ల లోపే. అయితే అమ్మినది కేవలం 9కోట్ల రేంజ్ లో కాబట్టి ఓకె. మరి ఓవర్ సీస్ లో మహేష్ మార్కెట్ సూపర్ అనుకున్నా, కూడా 16కోట్ల అన్న ఫిగర్ టెన్షన్ పెట్టేదే.

మహేష్ బాబు చరిష్మా, కొరటాల శివ ఛాలెంజింగ్ డైరక్షన్, డివివి దానయ్య అదృష్టం అన్నీ కలిస్తే, భరత్ అనే నేను చిరకాలం వుండే నాన్ బాహుబలి రికార్డు సృష్టించే అవకాశం వుంది. లెటజ్ హోప్.