ఈ కాలం సినిమాల రిలీజులకు పండగలు దొరకడం చాలా కష్టంగా మారింది. ప్రతి పండక్కి ఓ పెద్ద సినిమా సిద్ధంగా ఉంటోంది. దీంతో చిన్న సినిమాలన్నీ నాన్-ఫెస్టివ్ సీజన్ లోనే రిలీజ్ అవుతున్నాయి. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఫెస్టివల్ సీజన్ లో రిలీజ్ డేట్ పట్టేశాడు గోపీచంద్.
గోపీచంద్ నటిస్తున్న తాజా చిత్రం భీమా. ఈ సినిమాను మహాశివరాత్రి కానుకగా మార్చి 8న విడుదల చేయబోతున్నట్టు తాజాగా ప్రకటించారు. నిజానికి ఈ సినిమాను ఫిబ్రవరిలో షెడ్యూల్ చేశారు. నిన్నమొన్నటివరకు అదే తేదీకి లాక్ అయ్యారు కూడా.
ఎప్పుడైతే డబుల్ ఇస్మార్ట్ సినిమాపై అనుమానాలు పెరిగాయో, అప్పుడిక శివరాత్రికి వచ్చేయాలని భీమా టీమ్ నిర్ణయించింది. అనుకున్నదే తడవుగా కొత్త విడుదల తేదీతో పోస్టర్ రిలీజ్ చేసింది. పైగా ఈ సినిమాకు కాస్త డివోషనల్ టచ్ ఉన్నట్టు తెలుస్తోంది.
కన్నడ దర్శకుడు హర్ష ఈ సినిమాతో తెలుగుతెరకు దర్శకుడిగా పరిచయమౌతున్నాడు. ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మ హీరోయిన్లు.