Advertisement


Home > Movies - Movie News
బెడ్ మీద.. ఎక్కువ సేపు కావాలన్న హీరోయిన్!

టీవీ షోల్లో హీరోహీరోయిన్లు చాలా ఓపెనప్ అయిపోతూ ఉన్నారు. ప్రత్యేకించి తమ వ్యక్తిగత అభిరుచులను చెప్పుకోవడానికి కాస్త వెనుకాడే సెక్స్ విషయంలోనే వీళ్లు పూర్తి వివరాలు అందించేస్తూ ఉన్నారు. సెక్స్ లేకపోతే ఉండలేం.. అని కొందరు ఓపెన్ గానే చెప్పుకొంటూ ఉంటారు.

తాము పదహారేళ్ల వయసులోనే తొలి సెక్స్ అనుభవాన్ని పొందామని చెప్పుకునే బ్రహ్మచారి కుర్రాళ్లు, తమకు పలానా పోజులో సెక్స్ అంటే ఇష్టం అని చెప్పుకునే ఆలియా భట్ వంటి హీరోయిన్లు.. టీవీ షోల్లో హాట్ హాట్ గా మాట్లాడిన నేపథ్యం కలిగిన వారు. వీరు మాత్రమే కాదు.. కొత్త కొత్తగా చాలా మంది ఓపెనప్ అయిపోతున్నారు. 

ఇప్పుడు ఈ జాబితాలో చేరారు భూమి పెడ్నేకర్, ఆయుష్మాన్ ఖురానాలు. వీరిద్దరూ ఇది వరకూ రెండు సినిమాల్లో కలిసి నటించారు. వీరి తొలి సినిమా అప్పట్లో దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా నిలిచింది. ‘దమ్ లగా కే హైసా’ అనే ఆ సినిమాతో భూమి ఇంట్రడ్యూస్ అయ్యింది. ఆ సినిమాలో ఈమె స్థూల కాయురాలిగా అగుపించింది.

అత్యంత భారీ వెయిట్ తో ఇంట్రడ్యూస్ అయిన బాలీవుడ్ హీరోయిన్ గా నిలిచింది. ఆ తర్వాత తన లుక్ లో మార్పు తీసుకొచ్చింది. గ్లామరస్ హీరోయిన్ గా మారింది. నేహా దుపియా టాక్ షోకు వీరిద్దరూ వచ్చారు. ఈ సందర్భంగా సెక్స్ ప్రస్తావన వచ్చింది. ముందుగా ఆయుష్మాన్ ఖురానా మాట్లాడుతూ.. తను సెక్స్ లేకుండా ఉండేదంటే.. అది ఔట్ డోర్ లో షూటింగులప్పుడే అన్నాడు.

ఇక భూమిని ఉద్దేశించి కామెంట్ చేస్తూ.. ఆమె అసలు సెక్స్ లేకుండా ఉండలేదు అనేశాడితను! బహుశా జోక్ ఏమో! ఇక భూమితో ఎవరైనా వేరే కుర్రాడు డేటింగ్ చేయాలంటే ఏం అడ్వైజ్ ఇస్తావ్? అంటే.. వీలైనంత ఎక్కువ సేపు రొమాన్స్ చేయాలని, భూమికి అదే ఇష్టమని ఇతడు చెప్పుకొచ్చాడు! బెడ్ మీద ఎక్కువ సేపు గడపడం, ఓపికగా రొమాన్స్ చేయడం వస్తే భూమితో బాగుంటుందని చెప్పుకొచ్చాడు. ఈ విషయాన్ని ఆ హీరోయిన్ కూడా ధ్రువీకరించింది. ‘ఐ లైక్ ఇట్ స్లో.. ఐ లైక్ ఇట్ రొమాంటిక్..’ అంటూ చెప్పుకొచ్చింది ఈ హీరోయిన్.