సాక్షి గూటికి చేరిన బిత్తిరి సత్తి

బిగ్ బాస్ లో పాల్గొనేందుకే టీవీ9ను వీడాడని అంతా అనుకున్నారు. మరోవైపు సొంతంగా వెబ్ ఛానెల్ పెట్టే ఆలోచనతోనే టీవీ9కు రాజీనామా సమర్పించాడని కూడా కొందరన్నారు. కానీ అందర్నీ ఆశ్చర్యపరుస్తూ సాక్షి ఛానెల్ లో…

బిగ్ బాస్ లో పాల్గొనేందుకే టీవీ9ను వీడాడని అంతా అనుకున్నారు. మరోవైపు సొంతంగా వెబ్ ఛానెల్ పెట్టే ఆలోచనతోనే టీవీ9కు రాజీనామా సమర్పించాడని కూడా కొందరన్నారు. కానీ అందర్నీ ఆశ్చర్యపరుస్తూ సాక్షి ఛానెల్ లో చేరాడు బిత్తిరి సత్తి అలియాస్ చేవెళ్ల రవి.

అవును.. వీ6 ఛానెల్ తో ప్రారంభమైన బిత్తిరి సత్తి టీవీ ప్రస్థానం టీవీ9 నుంచి సాక్షి ఛానెల్ కు చేరింది. త్వరలోనే సాక్షి ఛానెల్ లో ఆయన తనదైన శైలిలో ఓ కార్యక్రమం స్టార్ట్ చేయబోతున్నాడు. అన్నీ అనుకున్నట్టు జరిగితే వచ్చే సోమవారం రాత్రి 8 గంటల 30 నిమిషాలకు సాక్షి ఛానెల్ లో బిత్తిరి సత్తి కొత్త కార్యక్రమం ప్రసారం అవుతుంది..

చాలా పెద్ద ప్యాకేజీ మాట్లాడుకొని మరీ టీవీ9లో జాయిన్ అయ్యాడు సత్తి. అయితే అతడు చేసిన ఇస్మార్ట్ న్యూస్ అనే కార్యక్రమం అందులో పెద్దగా క్లిక్ అవ్వలేదు. ఆ కార్యక్రమం కోసం పెట్టిన పెట్టుబడికి, వస్తున్న టీఆర్పీకి, రెవెన్యూకు అస్సలు పొంతన లేకుండా పోయింది.

ఈ క్రమంలో జరిగిన కొన్ని పరిణామాల నేపథ్యంలో, తప్పనిసరి పరిస్థితుల మధ్య టీవీ9ను వీడాడు సత్తి. అలా ఆ ఛానెల్ ను వీడిన కొన్ని రోజులకే సాక్షిలో ప్రత్యక్షమయ్యాడు. టీవీ9లో ఫెయిలైన సత్తి మేజిక్, సాక్షి ఛానెల్ లోనైనా క్లిక్ అవుతుందేమో చూడాలి.

అమరావతిపై కుండబద్దలు కొట్టిన జివిఎల్

తప్పు చెయ్యకపోతే ఎందుకు పారిపోయాడు?