cloudfront

Advertisement


Home > Movies - Movie News

బోయపాటి సినిమాకు బ్యాక్ డ్రాప్ అదీ

బోయపాటి సినిమాకు బ్యాక్ డ్రాప్ అదీ

బోయపాటి శ్రీనివాస్ డైరక్షన్ లో హీరో రామ్ చరణ్ చేయబోయే సినిమాకు రాజస్థానీ నేపధ్యం వుందని ఆ మధ్య వార్తలు వినవచ్చాయి. కానీ అసలు విషయం అదికాదట.

సినిమా విలన్ వ్యవహారం అంతా బీహారీ నేపథ్యంలో వుంటుందట. సినిమాలో కాస్త చెప్పుకోదగ్గ భాగమే బీహారీ నేఫథ్యంలో సాగుతుందట. ఆ సీన్లను అన్నీ బోయపాటి స్టయిల్ లో చాలా అంటే చాలా భారీగా వుంటాయట. అందుకోసం ఇక్కడ కొన్ని సెట్ లు వేసి, కొన్ని అక్కడ లోకేషన్లలో చిత్రీకరిస్తారట.

ఇప్పటికే ప్రశాంత్, వివేక్ ఓబరాయ్ లను ఈ సినిమా కోసం తీసుకున్నారు. మహేష్ మంజ్రేకర్ ను కూడా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇటు తమిళ, అటు బాలీవుడ్ నటీనటులను తీసుకోవడం ద్వారా శాటిలైట్ డిజిటల్ రేట్లు భారీగా వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు.

ఓ థర్డ్ పార్టీ నుంచి ఇప్పటికే 22కోట్లకు శాటిలైట్, డిజిటల్ ఆఫర్ వచ్చింది. ఇంకా ఎవరికీ ఇవ్వలేదు. కారణం, ఈ సినిమాకు 25కోట్లకు పైగానే డిజిటల్ శాటిలైట్ ఆదాయాన్ని నిర్మాత దానయ్య ఆశిస్తున్నారు. అయితే ఛానెళ్లేవీ నేరుగా రాలేదు. థర్డ్ పార్టీలు మాత్రం 22కోట్ల వరకు వచ్చినట్లు తెలుస్తోంది.

బోయపాటి సినిమా అంటే యాక్షన్ సీన్లు భారీగా వుంటాయి. అందువల్ల నార్త్ లో డబ్బింగ్ కు, డిజిటల్ వ్యూస్ కు ఆదరణ వుంటుంది. అందువల్ల కచ్చితంగా 25 నుంచి 26కోట్లు వస్తుందని వెయిట్ చేస్తున్నట్లు తెలుస్తోంది.