Advertisement

Advertisement


Home > Movies - Movie News

బ్రేక్ దర్శన్....జనాల డబుల్ స్టేట్ మెంట్లు

బ్రేక్ దర్శన్....జనాల డబుల్ స్టేట్ మెంట్లు

తితిదే బోర్డుకు ప్రత్యేక ఆహ్వానితులను పెద్ద సంఖ్యలో నియమించడంపై ఆక్షేపణలు వినిపించాయి. కోర్టు కూడా ఆ జీవోను నిలిపివేసింది. సరే, ఆ విషయం గురించి ఇప్పుడు డిస్కస్ చేయడం లేదు. 

కానీ అసలు ఎవరెవరు ఈ ప్రత్యేక ఆహ్వానితుల నియామకం గురించి విమర్శలు చేస్తున్నారో..ఇంత మంది తరచు బ్రేక్ దర్శనం చేసుకుంటే సామాన్య జనాలకు ఇబ్బంది కలుగుతుందని మాట్లాడుతున్నారో, అలాంటి పెద్దలు అంతా ఏనైనా సామాన్య దర్శనం చేసుకున్నారా?

అసలు ఎల్ 1, ఎల్ 2 అంటూ ప్రత్యేక దర్శనాల కేటగిరీని ప్రారంభించింది ఎవరు? జగన్ ప్రభుత్వం కాదు కదా? వాటిని రద్దు చేసింది జగన్ ప్రభుత్వం. అలాంటి దర్శనం కావాలంటే దేవుడి ట్రస్ట్ కు 10 వేల రూపాయలు డొనేషన్ ఇస్తే అవకాశం ఇస్తామని ప్రకటించి, ఆ విధంగా ధార్మిక కార్యక్రమాలకు నిధులు వచ్చేలా చేసారు.

అయినా కూడా ఒక్కరంటే ఒక్క సెలబ్రిటీ పదివేలు కట్టరు. రాజకీయ నాయకులు, వారి అనుచరులు, సినిమా జనాలు, పారిశ్రామిక వేత్తలు, ఒకరేమిటి ఏమాత్రం పలుకుబడి వున్నా, కాస్త సిఫార్సు లేఖ తెచ్చుకోగలిగినా ఈ ప్రత్యేక దర్శనం కోటాలో దూరిపోతారు. అంతెందుకు ఇప్పుడు టీటీడీ జాబితా మీద వార్తలు రాసే జర్నలిస్టులు కూడా నూటికి తొంభై మంది ఈ తరహా దర్శనం చేసుకునేవారే. రూపాయి చెల్లించకుండా.

పైకి అందరూ జగన్ బోలెడు మందికి పోస్టులు ఇచ్చేసాడు. దాంతో ఇక బ్రేక్ దర్శనాలు పెరిగిపోతాయి. సామాన్యులు అగచాట్లు పడతారు అని వాపోయేవారే. కానీ వీరంతా మళ్లీ తిరుపతి బయల్దేరితే చాలు సిఫార్సు లేఖల కోసం అంగలార్చేవారే. 

ఇలాంటి డబుల్ స్టేట్ మెంట్ గాళ్ల ఆటకట్టించాలి అంటే అసలు ప్రోటోకాల్ దర్శనం అన్నది తీసేయాలి. ఎవరైనా సరే పదివేలు కట్టాల్సిందే అనే నిబంధన తేవాలి. ఉత్తరాల సిఫార్సులకు చెల్లు చీటీ పాడాలి. 

అప్పుడు ఇక డబుల్ స్టేట్ మెంట్ లు వుండవు. దేవుడికి ఆదాయమూ సమకూరుతుంది. బడా బాబులకు పదివేలు లెక్క కాదు. సో, వారితో సమస్య లేదు. ఇలా సన్నాయి నొక్కులు నొక్కుతూ, డబుల్ స్టేట్ మెంట్లు ఇస్తూ పెరటి దోవలో సిఫార్సు లేఖలతో దర్శనం లైన్లో దూరేవారి ఆట కట్టేస్తుంది. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?