cloudfront

Advertisement


Home > Movies - Movie News

బన్నీ'గారు'.. మనసులో ఏదో పెట్టుకొని మాట్లాడారు

బన్నీ'గారు'.. మనసులో ఏదో పెట్టుకొని మాట్లాడారు

తను మైక్ ఎప్పుడు పట్టుకున్నా ఏదో ఒక మంచి విషయం లేదా గొప్ప విషయం చెప్పేస్తున్నానని ఫీల్ అవుతుంటాడు బన్నీ. ఈసారి కూడా అలానే ఫీల్ అయ్యాడు. వ్యక్తులకు రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకోవాలంటూ జనాలకు క్లాస్ పీకాడు. ఈ క్రమంలో శర్వానంద్ ను శర్వాగారు అంటూ బన్నీ పిలిచినా అది సెటైరిక్ గా అనిపించింది. అది వేరే విషయం. కాకపోతే అందరికీ రెస్పెక్ట్ ఇవ్వాలంటూ బన్నీ ఉన్నఫలంగా ఎందుకు ఈ క్లాస్ పీకాడో ఎవరికీ అర్థంకాలేదు. కొంపదీసి ఎవరైనా బన్నీని 'ఒరేయ్ బన్నీ' అని పిలిచారా..?

నిజానికి బన్నీకి పట్టుకున్న ఈ 'రెస్పెక్ట్ ఫోబియా' ఇప్పటిది కాదు. దువ్వాడ జగన్నాధమ్ సినిమా నుంచే పట్టుకుంది. ఆ టైమ్ లో బ్రాహ్మణులు సినిమాపై నిప్పులు చెరిగినప్పుడు, అప్పట్నుంచి రెస్పెక్ట్ అనే పదప్రయోగం స్టార్ట్ చేశాడు. రైటర్లకు రెస్పెక్ట్ ఇవ్వాలన్నాడు. డీజేకు వర్క్ చేసిన రచయితలకు అతిగౌరవం ఆపాదించాడు.

ఆ తర్వాత నా పేరు సూర్య సినిమాలో కూడా 'రెస్పెక్ట్ ఫోబియా' కనిపించింది. ఓ సినిమాకు ఎంతో కష్టపడి పనిచేసే టెక్నీషియన్లకు గౌరవం ఇవ్వాలన్నాడు. తనకు తెలిసిన నలుగురు టెక్నీషియన్లను ఆ సందర్భంగా 'గారు' అని సంభోదించాడు. ఇప్పుడు ఆర్టిస్టులకు కూడా గౌరవం ఇవ్వాలంటూ 'రెస్పెక్ట్ ఫోబియా'లో నెక్ట్స్ స్టేజ్ చూపించాడు బన్నీ.

"పెద్ద వాళ్లను ఎక్కడపడితే అక్కడ రెస్పెక్ట్ లేకుండా పిలిచేస్తున్నారు. అది తప్పు. హే.. కేసీఆర్.. హే చంద్రబాబు ఏంటిది? కేసీఆర్ గారు అనాలి. చంద్రబాబు గారు అనాలి. ఆ మధ్య టీవీలో చూశాను, ఒకడైతే హే.. చిరంజీవి అని అన్నాడు. చిరంజీవి ఏంట్రా.. చిరంజీవి గారు. పవన్ కల్యాణ్ గారు."

రాజకీయ నాయకుడు, సినిమా వాళ్లు అయినంత మాత్రాన గౌరవం ఇవ్వకూడదని లేదని, మనకు ఇష్టం ఉన్నా లేకపోయినా గారు అని సంభోదించాలంటూ బన్నీ క్లాస్ పీకాడు. పడి పడి లేచే మనసు ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కు ప్రత్యేక అతిథిగా హాజరైన అల్లుఅర్జున్.. ఇలా సినిమా గురించి తక్కువ, ఈ 'గారు' అనే టాపిక్ పై ఎక్కువగా మాట్లాడాడు.

అయితే ఇక్కడ బన్నీ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే.. 'గారు' అని పేరు చివర తగిలించనంత మాత్రాన అది గౌరవం ఇవ్వనట్టు కాదు. బాగా ఇష్టపడే వ్యక్తుల్ని ఏకవచనంలో పిలవడం కూడా గౌరవమే. చిరంజీవి, పవన్ కల్యాణ్, కేసీఆర్ లాంటి వ్యక్తుల్ని ఏకవచనంలో పిలిస్తే అది గౌరవభంగం కిందకురాదు. అందులో అభిమానం ఉంటుంది.

మా కేసీఆర్, మా పవన్, మా చిరు అంటూ అభిమానులు గట్టిగా అరిస్తే అది గౌరవభంగం కాదు. పేరుకు ముందు 'అరేయ్', 'ఒరే' లాంటి పదాలు చేరిస్తే అది గౌరవానికి భంగం కలిగినట్టు. ఈ చిన్న తేడా బన్నీకి తెలియదంటారా?

పడి పడి లేచే మనసు ప్రీ-రిలీజ్ ఫంక్షన్ ఫొటోస్ కోసం క్లిక్ చేయండి 

సాయి పల్లవి మీద వచ్చేవన్నీ రూమర్స్.. శర్వా సర్టిఫికెట్ 

పోర్న్ నిషేధం.. స్త్రీ వాదుల నుంచి వ్యతిరేకత! చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్