cloudfront

Advertisement


Home > Movies - Movie News

ఇప్పటివరకు నన్నెవరూ గోకలేదు

ఇప్పటివరకు నన్నెవరూ గోకలేదు

కాస్టింగ్ కౌచ్ పై ఒక్కొక్కరు ఒక్కో విధంగా రియాక్ట్ అవుతున్నారు. తాజాగా ఈ లిస్ట్ లోకి రష్మి కూడా చేరిపోయింది. తనను ఇప్పటివరకు ఎవరూ గోకలేదంటోంది ఈ జబర్దస్త్ బ్యూటీ. దీంతో పాటు కాస్టింగ్ కౌచ్ పై సూటిగా స్పందించింది. 

"అంతకుమించి సినిమా నిర్మాత నన్ను గోకలేదు. ఇతడే కాదు, ఏ ప్రొడ్యూసర్ నన్ను అలా చేయలేదు. కాస్టింగ్ కౌచ్ విషయంలో నేను చాలా నిజాయితీగా సమాధానం చెప్పాలనుకుంటున్నాను. ఈమధ్య చాలా పెద్దపెద్ద విషయాలు జరిగాయి. అవన్నీ నాకు తెలుసు. శ్రీరెడ్డి సిచ్యువేషన్ కావొచ్చు, మరొకరి పరిస్థితి కావొచ్చు.. ఉదంతం ఏదైనప్పటికీ ఎవరూ మనల్ని రేప్ చేయలేరు, బలవంతం చేయలేరు." 

ప్రతి విషయంలో 'నో' అని చెప్పే ఆప్షన్ ఒకటి ఉంటుందంటోంది రష్మి. వద్దంటే ఎవరూ మనల్ని ఫోర్స్ చేయరని, కాబట్టి కాస్టింగ్ కౌచ్ విషయంలో ఒకర్నే తప్పుబట్టడం సరైనది కాదంటోంది. అసలు కాస్టింగ్ కౌచ్ కు పాల్పడితే తప్పేంటని ప్రశ్నిస్తోంది. అది వ్యక్తిగత ఇష్టమని అంటోంది రష్మి.

"కాస్టింగ్ కౌచ్  అనేది ఓ ఛాయిస్ అంటాను నేను. దాన్ని నేను గౌరవిస్తాను కూడా. అంతా పాజిటివ్ గా ఉంటుంది, కెరీర్ బాగుందనిపిస్తే కాస్టింగ్ కౌచ్ కు ఓకే చెప్పొచ్చు. ఇద్దరి అంగీకారంతో జరిగేది అది. కాస్టింగ్ కౌచ్ అనేది పర్సనల్ ఛాయిస్ మాత్రమే. అంతెందుకు, ఈ ఇండస్ట్రీలోనే కాదు ప్రతి చోట కాస్టింగ్ కౌచ్ ఉంది. కాబట్టి ఈ వ్యవహారాన్ని ఇంత పెద్దది చేసి చూడాల్సిన అవసరం లేదు." 

కాస్టింగ్ కౌచ్ కు ఒప్పుకోకుండా, సొంత కష్టంతో పైకొస్తానంటే అలా కూడా రావొచ్చని, కానీ దానికి కాస్త ఎక్కువ టైం పడుతుందని అంటోంది రష్మి. కాస్టింగ్ కౌచ్ విషయంలో తనకు ఎలాంటి అనుభవాల్లేవని, రెమ్యూనరేషన్ విషయంలో మాత్రం తనకు నిర్మాతలకు అప్పుడప్పుడు గొడవలు జరుగుతుంటాయని అంటోంది.