cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Movie News

విడాకుల భ‌యం వ‌ల‌దు.. పెళ్లి వైపూ సెల‌బ్రిటీల మొగ్గు!

విడాకుల భ‌యం వ‌ల‌దు.. పెళ్లి వైపూ సెల‌బ్రిటీల మొగ్గు!

వారు విడాకులు తీసుకున్నార‌ని.. వీరు పెళ్లి అంటే భ‌య‌ప‌డ‌ట్లేదు! ఇదీ బాలీవుడ్, ఇండియ‌న్ సినీ సెల‌బ్రిటీల్లో ఉన్న గొప్ప స్ఫూర్తి అనుకోవాలేమో! ఒక‌వైపు అన్యోన్యంగా క‌నిపించిన వారు హ‌ఠాత్తుగా విడాకుల ప్ర‌క‌ట‌న చేస్తూ ఉంటారు. వైవాహిక జీవితం, విడాకులు వారిని చాలా డిస్ట్ర‌బ్ చేసిన‌ట్టుగా క‌నిపిస్తాయి. 

అది కూడా రెండు మూడేళ్ల వైవాహిక జీవిత‌మే వారిని చాలా అలిసిపోయేలా చేస్తుంది. అవ‌త‌ల ఇండియాలో సామాన్యుడు ఎన్ని క‌ష్టాలున్నా, ఎంత‌గా అడ్జ‌స్ట్ కావాల్సి ఉన్నా.. వైవాహిక జీవితాన్ని చాలా ఈజీగా తీసుకుని సాగుతాడు!

అయితే సెల‌బ్రిటీలు అయిపోగానే..  వైవాహిక జీవితం, అది కూడా తాము ఏరికోరి ఎంచుకున్న వ్య‌క్తితో ప్ర‌యాణం చాలా క‌ష్టం అయిపోతుంది. పెళ్లికి ముందు ప్రేమించుకున్నంత కాలం కూడా, పెళ్లి త‌ర్వాత క‌లిసి జీవించి ఉండ‌టం కొంత‌మంది సెల‌బ్రిటీల‌కు క‌ష్టం అయిపోతోంది. వారి పెళ్లి జ‌రిగిన‌ప్ప‌టి నుంచి అదిగో విడిపోయారు, ఇదిగో విడిపోయారు అనే టాక్ ఒక‌టి ఎప్ప‌టిక‌ప్పుడు ఫ్రెష్ గా న‌డుస్తూనే ఉంటుంది. చివ‌ర‌కు ఆ ఊహాగానాలు ఏదో ఒక ద‌శ‌లో నిజం అయిపోతుంటాయి.

మ‌రి ఇదంతా చూస్తుంటే.. అస‌లు ఈ సినిమా వాళ్లు ఎందుకు పెళ్లి లేదా పెళ్లిళ్లు చేసుకుంటారో! అని కొంద‌రు పెద‌వి విరుస్తుంటారు. త‌మ సాటి వాళ్ల‌నో, తోటి వాళ్ల‌నో చూసి వీరో పాఠం నేర్చుకోలేరా.. అని సులువుగా కామెంట్ చేసేయొచ్చు. అయితే.. ఎవ‌రి జీవితం వారిది. తామైతే ఆ ప‌రిస్థితిని మ‌రోలా డీల్ చేస్తామ‌నే ధీమా ఏ విష‌యంలో అయినా, ఎవ‌రికైనా ఉంటుంది. ఈ ఆలోచ‌నే సినిమా ఇండ‌స్ట్రీలో మ‌రి కొన్ని పెళ్లిళ్ల‌కు పునాది వేస్తుంది.

ఇటీవ‌లి కాలంలో సోష‌ల్ మీడియా ఆవ‌ల‌, లోప‌ల బాగా చ‌ర్చ‌కు నోచుకున్న ఆమిర్ ఖాన్ కిర‌ణ్ రావు విడాకులు, స‌మంత నాగ‌చైత‌న్య  విడాకులు... ఇవేవీ కొత్త‌గా వైవాహిక బంధంలోకి ప్ర‌వేశించాల‌నుకునే సినిమా వాళ్ల‌ను ఆప‌లేక‌పోతున్నాయ‌ని గ‌మ‌నించ‌వ‌చ్చు. ఇప్ప‌టికే విడాకులు తీసుకున్న బోలెడంత మంది స్టార్ల జాబితాలో వీరు కొత్త‌గా యాడ్ అయ్యారు. 

ఇదే స‌మ‌యంలో బాలీవుడ్ వాలాల‌నే ఎంచుకుని పెళ్లి పీట‌లు ఎక్కే వారి జాబితా కూడా పెరుగుతోంది. క‌త్రినా కైఫ్  విక్కీ కౌశ‌ల్, ర‌ణ్ భీర్ క‌పూర్ అలియా భ‌ట్.. వీళ్లు త్వ‌ర‌లోనే పెళ్లి పీట‌లెక్క‌బోతున్నార‌నే మాట వినిపిస్తోంది. ఎవ‌రో పెళ్లి చేసుకుని జీవించ‌లేక‌పోయినా.. ఆ ప్ర‌భావం ఈ జంట‌ల‌పై లేద‌నే చెప్పాలి.

పెళ్లి అనేది ఎవ‌రికి వారి వ్య‌క్తిగ‌తం. వారి దృక్ప‌థం. అన్నింటికి మించి.. విడాకులు తీసుకున్న సెల‌బ్రిటీల్లో ప్రత్యేకించి స్త్రీలు ఎక్కువ కాలం ఒంట‌రిగా ఉండ‌టానికి ప్రాధాన్య‌త‌ను ఇవ్వ‌డం లేదనే విష‌యాన్ని కూడా గ‌మ‌నించ‌వ‌చ్చు. విడాకులు తీసుకున్న త‌ర్వాత  సెల‌బ్రిటీల్లో మేల్ సెల‌బ్రిటీ.. త‌న వ్య‌వ‌హారాన్ని దాదాపు ర‌హ‌స్యంగా మార్చేసుకుంటాడు. 

అదే స్త్రీ విష‌యానికి వ‌స్తే.. వారు మ‌రో పెళ్లికి కూడా ముంద‌డుగు వేస్తున్న దాఖ‌లాలు క‌నిపిస్తున్నాయి. మాన‌సికంగా ఒక తోడు పెళ్లితోనే వారికి ల‌భిస్తుంద‌న‌డంలో ఎలాంటి విడ్డూరం లేదు.

హీరోలు దేవుళ్లా ఏందీ?

జగన్: దూకుడే.. ముందుచూపు ఏదీ?!