Advertisement

Advertisement


Home > Movies - Movie News

బన్నీని పాన్ ఇండియా స్టార్ ను చేసిన కేంద్రం

బన్నీని పాన్ ఇండియా స్టార్ ను చేసిన కేంద్రం

ప్రభాస్ పాన్ ఇండియా హీరో, రాజమౌళి పాన్ ఇండియా డైరెక్టర్, కేజీఎఫ్ యష్.. మరో పాన్ ఇండియా స్టార్.. అబ్బో సౌత్ నుంచి చాలామంది ఉన్నారు, అసలు సౌతిండియా సూపర్ స్టార్ రజినీకాంతే పెద్ద యూనివర్సల్ స్టార్. 

ఇక బాలీవుడ్ బాద్షా, షెహన్షా.. ఇలా గొప్ప గొప్ప ఖాన్లు, ఖన్నాలు కూడా ఉన్నారు. కానీ వారందర్నీ పక్కనపెట్టి దేశం కోసం, మాస్క్ కోసం, కరోనాపై పోరు కోసం భారత ప్రభుత్వం తరపున సమాచార శాఖ అల్లు అర్జున్ కి పెద్దపీట వేసింది. 

పుష్ప నుంచి తగ్గేదేలే డైలాగ్ ని వాడేసుకుంది. 'మాస్క్ తీసేదేలే' అంటూ అదిరిపోయే మీమ్ క్రియేట్ చేసి వదిలింది. ఈ ఒక్క మీమ్ తో బన్నీని పాన్ ఇండియా స్టార్ ను చేసింది కేంద్రం.

పుష్పకి అదిరిపోయే పబ్లిసిటీ..

అల్లు అర్జున్ అదృష్టం ఏంటో కానీ.. ఆమధ్య అలవైకుంఠపురం... బుట్టబొమ్మ పాటకి స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ డ్యాన్స్ చేసి అదరగొట్టాడు, దానికి వరల్డ్ వైడ్ పబ్లిసిటీ తెచ్చాడు. ఇప్పుడు పుష్ప మూవీలో ఊ అంటావా పాట కూడా.. ఆఫ్రికా దేశాల్ని ఊపేస్తోంది. అది వారికి పబ్లిసిటీయా, వీరికి ఉపయోగమా అనే విషయాల్ని పక్కనపెడితే.. సోషల్ మీడియాలో మాత్రం ఈ పాటలు, మేనరిజమ్స్ అదిరిపోతున్నాయి. 

పుష్పలో అల్లు అర్జున్ వాకింగ్ స్టైల్ కూడా ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. ఎన్ని మీమ్స్, ఎన్ని ట్రోలింగ్స్.. లెక్కే లేదు. తాజాగా తగ్గేదేలే అనే పాపులర్ డైలాగ్ ని మరింత పాపులర్ చేసింది కేంద్ర సమాచార, ప్రసార శాఖ.

డెల్టా అయినా ఒమిక్రాన్ అయినా..

డెల్టాహో.. యా ఒమిక్రాన్ మై మాస్క్ ఉతరేంగా నహీ. ఇదీ ఆ కాన్సెప్ట్. డెల్టా అయినా, ఒమిక్రాన్ అయినా.. మాస్క్ తీసేదేలా.. అస్సలు తగ్గేదేలే అంటూ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో తెలంగాణ విభాగం కూడా తెలుగులో దీన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. 

విశేషం ఏంటంటే.. ఏపీ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో మాత్రం దీన్ని టచ్ చేయలేదు. అసలే సినిమాల విషయంలో గొడవ జరుగుతోంది, అందులోనూ పుష్ప ఈవెంట్ కి పర్మిషన్ ఇవ్వకుండా, బంగార్రాజుకి పర్మిషన్ ఇచ్చారు, ఏకంగా మంత్రి, ఎంపీ కూడా ఆ ఫంక్షన్ కి వెళ్లారనే అపవాదు ఉంది.

ఈ నేపథ్యంలో పుష్పని ఏపీ టచ్ చేయలేదు, తెలంగాణ వాడేసుకుంది. అటు కేంద్రం కూడా బ్రహ్మాండంగా ఐకాన్ స్టార్ మేనరిజం కి అదిరిపోయే పబ్లిసిటీ ఇచ్చేసింది. చూస్తుంటే రామ్ గోపాల్ వర్మ జోస్యమే నిజమయ్యేట్టుగా ఉంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?