Advertisement


Home > Movies - Movie News
ఛలో వెంకీకి మరో మంచి ఆఫర్!

ఛలో సినిమాతో దర్శకుడిగా మంచి మార్కులు అందుకున్నాడు వెంకీ కుడుముల. ఓ పాత చింతకాయ పచ్చడిలాంటి కథకు మంచి నేపథ్యం, ఫన్నీ డైలాగులు జోడించి సక్సెస్ కొట్టాడు. ఛలో సక్సెస్ తో వెంకీతో సినిమాలు చేసేందుకు చాలామంది నిర్మాతలు, హీరోలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇందులో భాగంగా ఓ మంచి ఆఫర్ అందుకున్నాడు వెంకీ.

హారిక-హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఈ దర్శకుడు తన నెక్ట్స్ సినిమా చేయబోతున్నాడు. ఈ మేరకు చినబాబు నుంచి కొంత మొత్తం అడ్వాన్స్ కూడా అందుకున్నాడట. వెంకీ దగ్గర ఇప్పటికే 2-3 కథలు సిద్ధంగా ఉన్నాయి. ఆ విషయాన్ని అతడే ఈమధ్య ప్రకటించాడు. అందులో ఏ కథతో, ఏ హీరోను ఒప్పిస్తాడనేది ప్రస్తుతానికి సస్పెన్స్. 

వెంకీకి త్రివిక్రమ్ లాంటి దర్శకుడి సపోర్ట్ ఉంది. నిజానికి హారిక-హాసిని సంస్థలో అవకాశం వచ్చేలా చేసింది కూడా త్రివిక్రమే అని తెలుస్తోంది. వెంకీ దర్శకత్వంలో ఓ మీడియం రేంజ్ బడ్జెట్ సినిమా చేయమని చినబాబుకు చెప్పింది త్రివిక్రమేనట. అలా వెంకీకి సెకెండ్ ఛాన్స్ వచ్చింది.