Advertisement


Home > Movies - Movie News
ఫ్యామిలీ మేన్ గా మారిపోయిన రామ్ చరణ్

మొన్నటివరకు యాక్షన్ లుక్ లో కనిపించాడు రామ్ చరణ్. ఇప్పుడు పూర్తిగా ఫ్యామిలీ మేన్ లా మారిపోయాడు. బోయపాటితో చేస్తున్న సినిమాకు సంబంధించిన మేటర్ ఇది. ఈ మూవీకి సంబంధించి రేపట్నుంచి కొత్త షెడ్యూల్ ప్రారంభంకాబోతోంది. హైదరాబాద్ లో జరగనున్న ఈ షెడ్యూల్ లో రామ్ చరణ్, మరికొంతమంది క్యారెక్టర్ ఆర్టిస్టుల మధ్య ఫ్యామిలీ ఎపిసోడ్స్ తెరకెక్కించబోతున్నారు.

ఈ సినిమాలో భారీ స్టార్ కాస్ట్ ఉంది. చరణ్ మాత్రమే కాకుండా.. ప్రశాంత్, స్నేహ లాంటి నటీనటులున్నారు. వీళ్లందరితో కలిసున్న సన్నివేశాల్ని రేపట్నుంచి షూట్ చేయబోతున్నారు. 2వారాల పాటు ఈ షెడ్యూల్ ఉంటుంది. ఆ తర్వాత యూనిట్ అంతా కలిసి 2పాటల షూటింగ్ కోసం యూరోప్ వెళ్తుంది. రీసెంట్ గా సినిమాకు సంబంధించి బ్యాంకాక్ షెడ్యూల్ పూర్తిచేశారు.

దసరాకు విడుదల చేయాలని టార్గెట్ గా పెట్టుకున్న ఈ సినిమాకు ఇంకా టైటిల్ ఫిక్స్ చేయలేదు. ఓ క్లాసీ టైటిల్ పెట్టాలని బోయపాటి ఆలోచిస్తుంటే.. మాస్ టైటిల్ కోసం మెగా కాంపౌండ్ పట్టుబడుతోంది. త్వరలోనే టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ రిలీజ్ చేయబోతున్నారు.

రంగస్థలం లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత చరణ్ నుంచి వస్తున్న సినిమా కావడంతో, ఈ ప్రాజెక్టుపై భారీ అంచనాలున్నాయి. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో చెర్రీ సరసన కిరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది.