cloudfront

Advertisement


Home > Movies - Movie News

ముగ్గురూ మళ్లీ కలిశారు.. పార్టీ చేసుకున్నారు

ముగ్గురూ మళ్లీ కలిశారు.. పార్టీ చేసుకున్నారు

మొన్నటికి మొన్న భరత్ అనే నేను ఈవెంట్ ముగిసిన తర్వాత మహేష్, రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి ఎక్స్ క్లూజివ్ గా పార్టీ చేసుకున్నారు. ఆ ఈవెంట్ కు హాజరుకానప్పటికీ, పార్టీకి హాజరయ్యాడు చరణ్. ఇప్పుడు ఈ ముగ్గురూ మరోసారి కలిసి ఖుషీగా పార్టీ చేసుకున్నారు. అవును.. మహేష్, తారక్, చరణ్ మళ్లీ కలిశారు. ఇప్పుడీ స్టిల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

టాలీవుడ్ లో చిరంజీవి అధ్యక్షతన ఏర్పాటైన ప్రత్యేకమైన సమావేశానికి వీళ్లు ముగ్గురూ హాజరయ్యారు. సమావేశం ముగిసిన వెంటనే అట్నుంచి అటు వెళ్లిపోయి పార్టీ చేసుకున్నారు. నిజానికి మరోసారి కలవాలని భరత్ అనే నేను సినిమా టైమ్ లోనే వీళ్లు అనుకున్నారట. సినిమా హిట్ అయితే కచ్చితంగా మరోసారి పెద్ద పార్టీ ఇస్తానని తారక్, చెర్రీకి మాటిచ్చాడట మహేష్.

మూవీ సక్సెస్ అవ్వడంతో చెప్పినట్టుగానే ముగ్గురూ కలిసి మరోసారి పార్టీ చేసుకున్నారు. భరత్ అనే నేను సినిమాను అటు ఎన్టీఆర్, ఇటు రామ్ చరణ్ ప్రత్యేకంగా మెచ్చుకున్నారు. సినిమాను ఎన్టీఆర్ ఓ రిమార్కబుల్ మూవీగా చెప్పుకొస్తే.. రామ్ చరణ్ ఏకంగా మాస్టర్ పీస్ అనేశాడు. వీళ్ల ముగ్గురూ మరోసారి కలిసిన ఈ ఫొటోను చరణ్ భార్య ఉపాసన సోషల్ మీడియాలో షేర్ చేశారు.