cloudfront

Advertisement


Home > Movies - Movie News

వినయ విధేయంగా ఆ సీక్వెన్స్ తీసేశారుగా!

వినయ విధేయంగా ఆ సీక్వెన్స్ తీసేశారుగా!

మొన్నటివరకు బాలకృష్ణ నటించిన కొన్ని సినిమాలు చూసి నవ్వుకునే పరిస్థితి. తొడకొడితే రైలు ఆగిపోవడం, చిటికేస్తే కుర్చీరావడం, ఎర్రగా చూస్తే కుక్కలు ఆగిపోవడం లాంటి సన్నివేశాలు బాలయ్య సినిమాలకే సొంతం. ఇప్పుడు వాటిని తలదన్నేలా వినయ విధేయరామ సినిమాలో సన్నివేశాలున్నాయి. ఈ సీన్స్ అన్నీ ఇప్పుడు సోషల్ మీడియాలో కామెడీ పీస్ లుగా మారాయి.

చావుబతుకుల్లో ఉన్న అన్నయ్య ఫోన్ చేసి తమ్ముడ్ని(రామ్ చరణ్) రమ్మంటే, హీరో ఎయిర్ పోర్ట్ కిటికీ నుంచి దూకేస్తాడు. ఎగిరెళ్లి ట్రయిల్ మీద పడతాడు. అలానే నిల్చొని గుజరాత్ లోని ద్వారక నుంచి నేపాల్ బోర్డర్ వరకు కొన్నిగంటల్లో వెళ్లిపోతాడు. మధ్యలో ఏదో ఒకచోట ఆగి ఛాతి, వీపు నిండా పచ్చబొట్లు (టాటూలు) కూడా వేయించుకుంటాడు.

ఈ సీన్ చూసిన జనాలు ఓ రేంజ్ లో నవ్వుకున్నారు. సోషల్ మీడియాలో అయితే దీనిపై పడుతున్న సెటైర్లు అన్నీఇన్నీ కావు. ఇక బుల్లెట్ ట్రయిన్స్ ఆపేయండని కొందరు అంటుంటే, విమానాలు ఎందుకు దండగ అని మరికొందరు, ట్రయిన్ లోపలికి వెళ్లి కూర్చోడానికి డబ్బుల్లేవా అని ఇంకొందరు సెటైరిక్ గా పోస్టులు మీద పోస్టులు పెడుతున్నారు.

చరణ్ పరువు తీసిన ఆ సన్నివేశాన్ని ఇప్పుడు సినిమా నుంచి తొలిగించారు. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని మల్టీప్లెక్లుల్లో ఈ సీన్ కట్ చేశారు. కొన్ని బి-సెంటర్లలో కూడా తీసేశారు. ఎందుకో సి-సెంటర్లలో మాత్రం ఈ సీన్ ను అలానే ఉంచారు. నిజానికి వినయ విధేయరామ సినిమా నుంచి సన్నివేశాలు తీయాల్సి వస్తే ఇలాంటివి కోకొల్లలు. 

తేలని అభ్యర్థుల ఎంపిక.. పవన్ కల్యాణ్ పనే హాయి!

NTR బయోపిక్ గురించి తెలియని విషయాలు