Advertisement

Advertisement


Home > Movies - Movie News

'చావు కబురు' డైరక్టర్ పై దృష్టి

'చావు కబురు' డైరక్టర్ పై దృష్టి

టాలీవుడ్ లో కొత్త డైరక్టర్లు, ముఖ్యంగా కాస్త విషయం వున్న డైరక్టర్ల కోసం గాలింపు ముమ్మరంగా సాగుతోంది. సినిమా విడుదలయిన తరువాత ఏ మాత్రం టాలెంట్ వుందీ అన్నా పిలిచి మరీ అడ్వాన్స్ లు చేతిలో పెట్టి లాక్ చేస్తున్నారు. షూటింగ్ టైమ్ లో దర్శకుడి దగ్గర విషయం వుందట అని తెలిసినా, ఓ కన్నేసి వుంచుతున్నారు. 

టీజర్, ట్రయిలర్ రాగానే లాక్ చేసే ప్రయత్నాలు ప్రారంభిస్తున్నారు. గీతా 2 పతాకంపై బన్నీవాస్ నిర్మిస్తున్న చావు కబురు చల్లగా సినిమా టీజర్ విడుదల నాటి నుంచి వార్తల్లోకి వచ్చింది. గీతా సంస్థ చిన్న సినిమా నిర్మిస్తోంది అంటే అందులో విషయం వుంటుందని తెలుసు, కానీ టీజర్ వైవిధ్యంగా వుండడంతో సినిమా మీద ఆసక్తి పెరిగింది. 

కాస్త గ్యాప్ తరువాత ఇప్పుడు ట్రయిలర్ బయటకు వచ్చింది. దీంతో సినిమా మీద ఆసక్తి మరికాస్త పెరగడం సంగతి అలా వుంచితే, డైరక్టర్ ఎవరు? అన్న ఆచూకీలు మొదలయ్యాయి. ట్రయిలర్ చూసి డైరక్టర్ మీద రుమాలు వేయాలనే ఎంక్వయిరీలు స్టార్ట్ అయినట్లు బోగట్టా. 

సాధారణంగా గీతాలో సినిమా చేసి బాగుంది అనిపించుకుంటే వాళ్లే వదలరు. కానీ గతంలో గీతా లో చేసిన వారు బయటకు వెళ్లి ఓ సినిమా చేసి మళ్లీ గీతాకు వచ్చిన సందర్భాలు వున్నాయి. అందుకే చావు కబురు చల్లగా డైరక్టర్ మీద కూడా వేరే బ్యానర్ల దృష్టి పడి ఎంక్వయిరీలు మొదలైనట్లు బోగట్టా.

లోకేశ్ ప్ర‌తిమాట ఆణిముత్య‌మే

హైకోర్టుకు నిమ్మ‌గ‌డ్డ సారీ

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?