Advertisement


Home > Movies - Movie News
'చెప్పను బ్రదర్‌'

సినీ నటుడు, జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ రాజకీయ యాత్ర ప్రారంభించిన నేపథ్యంలో అభిమానులతో పాటు మెగా కాంపౌండ్‌ నుంచి పెద్దఎత్తున మద్ధతు లభిస్తోంది.

చిరంజీవి తనయుడు-మెగాపవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌, మరో ఇద్దరు హీరోలు వరుణ్‌తేజ్‌, సాయిధరమ్‌తేజ్‌లు పవన్‌కు ఆల్‌ ది బెస్ట్‌ చెబుతూనే మా మద్ధతు ఉంటుందని ట్వీటర్‌లో ట్వీట్లు చేశారు. 

అయితే మెగా హీరో ట్యాగ్‌ లైన్‌తో చెలామణి అవుతున్న అల్లుఅర్జున్‌ మాత్రం ఇప్పటిదాకా ఈ అంశంపై స్పందించలేదు.

సోషల్‌ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే బన్నీ.. ఇప్పటిదాకా పవన్‌కు విషెస్‌ చెప్పకపోవటం వెనుక కొందరు కారణాలను అన్వేషిస్తున్నారు.

స్టైలిష్‌ స్టార్‌ బ్రదర్‌ అల్లు శిరీష్‌ కూడా ఈ విషయంపై స్పందించలేదు.

ఏది ఏమైనా సరైనోడు చిత్రం బ్లాక్ బస్టర్ ఫంక్షన్ లో పవన్‌ గురించి ‘చెప్పను బ్రదర్‌’ అంటూ స్టేట్‌మెంట్‌ ఇచ్చి పీకే ఫ్యాన్స్‌కు దూరమైన బన్నీ నుంచి.. ఇప్పుడు ఎలాంటి స్పందన లేకపోవటం పెద్ద విశేషమేమీ కాదని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.