Advertisement

Advertisement


Home > Movies - Movie News

చెవిరెడ్డిపై జగన్ కు కంప్లయింట్?

చెవిరెడ్డిపై జగన్ కు కంప్లయింట్?

చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి గురించి జనాలకు బాగానే పరిచయం. రెండు సార్లు చంద్రగిరి నుంచి గెలిచారు. అది కాదు విషయం. ఆయన సినిమా జనాలకు బాగా సన్నిహితంగా వుంటారు. ఇప్పుడు అదే విషయం మీద సిఎమ్ జగన్ ను ఫిర్యాదు అందినట్లు తెలుస్తోంది.

సినిమా రంగానికి చెందిన వారంతా సినిమా విడుదల వుంటే చాలు తిరుపతి దేవుడిని గుర్తుచేసుకుని అక్కడ వాలిపోతారు. వీళ్లందరికీ ప్రత్యేక దర్శనాలు ఏర్పాటు చేయించడాలు, మర్యాదలు చేయడాలు, కాటేజ్ లు ఇలాంటివి అన్నీ ఇప్పుడు చెవిరెడ్డినే ఎక్కువగా చూస్తున్నారు. ఆయనే స్వయంగా వారి వెంట వుండి దర్శనాలకు తీసుకెళ్లడం వంటి కార్యక్రమాలు పెట్టుకుంటున్నారు.

నిజానికి సినిమా జనాలు ఆంధ్రకు దూరం. తెలంగాణ సిఎమ్ అన్నా, అక్కడి నాయకులు అన్నీ హీరోలు వంగి వంగి సలాం కొడతారు. కానీ జగన్ అంటే మాత్రం అంటీ ముట్టనట్లు వుంటారు. ఈ విషయం ఇటీవల ఆంధ్ర జ్యోతి ఆర్కే కూడా డైరెక్ట్ గా క్రిటిసైజ్ చేసారు. ఇలాంటి సినిమా జనాలకు చెవిరెడ్డి అడుగులకు మడుగులు వత్తి, దర్శనాలు చేయించడం అన్నది ఒక పాయింట్. 

అదే చెవిరెడ్డి పార్టీ జనాలు కానీ, పార్టీ సోషల్ మీడియా వింగ్ జనాలు కానీ వస్తే పొరపాటున కూడా సహకరించడం లేదట. అస్సలు పట్టించుకోవడం లేదట. ఇది రెండో పాయింట్.

ఈ రెండు పాయింట్లు కలిపి సిఎమ్ జగన్ కు ఫిర్యాదుగా వెళ్లినట్లు తెలుస్తోంది. ఆయన తాను పిలిపించి మాట్లాడతానని మాట ఇచ్చినట్లు తెలుస్తోంది.

లోకేశ్ ప్ర‌తిమాట ఆణిముత్య‌మే

హైకోర్టుకు నిమ్మ‌గ‌డ్డ సారీ

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?