cloudfront

Advertisement


Home > Movies - Movie News

షికాగో సెక్స్‌ రాకెట్‌: ఆడియో టేపుల కలకలం

షికాగో సెక్స్‌ రాకెట్‌: ఆడియో టేపుల కలకలం

తెలుగు సినీ పరిశ్రమలో 'షికాగో సెక్స్‌ రాకెట్‌' ప్రకంపనలు పుట్టిస్తోంది. శ్రీరాజ్‌ అలియాస్‌ కిషన్‌, ఆయన భార్య షికాగో కేంద్రంగా పెద్ద సెక్స్‌ రాకెట్‌ నడపడం, అది కాస్తా వెలుగు చూడటం, ఈ కేసులో ఐదుగురు హీరోయిన్లను అక్కడి పోలీసులు 'విక్టిమ్స్‌'గా పేర్కొనడం తెల్సిన విషయాలే. ఆ విక్టిమ్స్‌ ఎవరన్నదానిపై రకరకాల ఊహాగానాలు విన్పిస్తున్నాయి. ఫలానా హీరోయిన్‌, ఫలానా యాంకర్‌.. అంటూ మీడియాలో చూచాయిగా కొందరి పేర్లు బయటకొచ్చేశాయి. 

తాజాగా, ఈ కేసుకు సంబంధించి కొన్ని ఆడియో టేపులు వెలుగు చూడటంతో అంతా అవాక్కవుతున్నారు. శ్రీరాజ్‌ అలియాస్‌ కిషన్‌, కొందరు నటీమణులు, యాంకర్స్‌తో మాట్లాడిన వివరాలు ఆ టేపుల ద్వారా బయటకొచ్చాయి. ఈ టేపులు అసలు ఎలా బయటకు వచ్చాయన్నది ప్రస్తుతం ఇంట్రెస్టింగ్‌ అంశంగా మారింది. అతి తక్కువ కాలంలోనే సినీ పరిశ్రమకు అత్యంత సన్నిహితుడిగా ఎదిగిన శ్రీరాజ్‌పై, అమెరికాలోని తెలుగు సంఘాలే కాదు, తెలుగు సినీ పరిశ్రమలోని కొందరు 'మీడియేటర్స్‌' కూడా గుస్సా అవడం మామూలే. సో, శ్రీరాజ్‌ వ్యతిరేకుల నుంచే ఈ ఆడియో టేపులు బయటకు వచ్చాయన్నది ఓ వాదన. 

మరోపక్క, అమెరికా నుంచే ఆడియో టేపులు లీక్‌ అవుతున్నట్లు మరో ప్రచారం కూడా జరుగుతోంది. ఎలా లీక్‌ అవుతున్నాయన్న విషయం పక్కన పెడితే, ఆడియో టేపుల్లో తమ వాయిస్‌ బయటపడ్తుందేమోనని తెలుగు సినీ పరిశ్రమలో కొందరు నటీమణులు తీవ్ర ఆందోళన చెందుతున్నారట. 'ఆ రాకెట్‌తో మాకేమీ సంబంధం లేదు' అని ఇప్పటికే ప్రకటించిన తారల్లో కొందరు, ఇప్పుడు ఈ టేపులతో కంగారు పడాల్సి వస్తోంది. 

అమెరికాలో తెలుగు సంఘాలు వివిధ కార్యక్రమాలు నిర్వహించడం చాలాకాలంగా జరుగుతున్న వ్యవహారమే. అయితే, ఆ కార్యక్రమాల ముసుగులో సెక్స్‌ రాకెట్‌ నడపడమే అసలు సమస్య. పద్ధతిగా అమెరికాలోని తెలుగు సంఘాలు ఏర్పాటు చేసిన కార్యక్రమాలకు హాజరై, తిరిగొచ్చేసినవారు సైతం.. శ్రీరాజ్‌ ఉదంతంతో నిందలు మోయాల్సిన దుస్థితి దాపురించిందన్నది నిర్వివాదాంశం. 

ఇదిలా వుంటే, శ్రీరాజ్‌ సెక్స్‌ రాకెట్‌ వ్యవహారానికి సంబంధించి త్వరలో వీడియో క్లిప్స్‌ కూడా విడుదల కాబోతున్నాయంటూ సోషల్‌ మీడియాలో కొన్ని పోస్టింగ్స్‌ హల్‌చల్‌ చేస్తున్నాయి. ఆడియో టేపులు వెలుగు చూశాక, వీడియో క్లిప్స్‌ వచ్చినా రావొచ్చుగాక. సెక్స్‌ రాకెట్‌ వెలుగు చూడటంతోనే తెలుగు సినిమా పరువు బజార్న పడింది. వీడియో క్లిప్స్‌ వస్తే ఇంకేమన్నా వుందా.?