cloudfront

Advertisement


Home > Movies - Movie News

తేజూ కోరుకున్నది దొరికిందా?

తేజూ కోరుకున్నది దొరికిందా?

ఫ్లాపుల్లో డబుల్ హ్యాట్రిక్ కొట్టిన సాయితేజ్, చిత్రలహరిపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. అతడి ఆశ కొంతమేరకు నెరవేరిందనే చెప్పాలి. మొదటిరోజు ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో పాటు మంచి వసూళ్లు కూడా వచ్చాయి. చిత్రలహరి సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో మొదటిరోజు అటుఇటుగా 3 కోట్ల రూపాయల షేర్ వచ్చింది.

ఎలక్షన్ సీజన్ ముగిసిన వెంటనే సినిమా రిలీజ్ అయింది. ఎన్నికల కోసం ఊరెళ్లిన చాలామంది జనాలు హాలిడే మూడ్ లో ఉన్నారు. ఓటు పని పూర్తిచేసి రిలాక్స్ అయ్యారు. సరిగ్గా వీకెండ్ కూడా మొదలవ్వడంతో ఈ రెండురోజుల్లో చిత్రలహరికి మరిన్ని వసూళ్లు వస్తాయని ట్రేడ్ అంచనా వేస్తోంది. సినిమాకు పాజిటివ్ టాక్ రావడం కలిసొచ్చే అంశం.

తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 11 కోట్ల రూపాయల బిజినెస్ చేసింది చిత్రలహరి. ఒకప్పుడు ఈ హీరో సినిమాలు పాతికకోట్ల బిజినెస్ చేస్తే, ఫ్లాపులు కారణంగా అదిప్పుడు 11 కోట్లకు పడిపోయిందన్నమాట. కానీ బ్రేక్-ఈవెన్ అవ్వడానికి ఇది బాగా కలిసొచ్చింది. ఇదే ట్రెండ్ కొనసాగితే, మరో 4 రోజుల్లో సినిమా బ్రేక్-ఈవెన్ అవుతుందని భావిస్తున్నారు.

అయితే ఇక్కడ తేజూకు మరోవారం మాత్రమే మిగిలిఉంది. ఎందుకంటే వచ్చేవారం నాని నటించిన జెర్సీ సినిమా వస్తోంది. ఆ మూవీపై భారీ అంచనాలున్నాయి. పైగా రీసెంట్ గా వచ్చిన ట్రయిలర్ కూడా సూపర్ గా క్లిక్ అయింది. సో.. ఈవారం రోజుల్లో చిత్రలహరి ఎంత వసూళ్లు సాధిస్తుందనేదే కీలకం. అదే ఫైనల్ కూడా.

ఒపీనియన్ కోసం నేను చిరంజీవిగారిని వెళ్లి అడిగాను